జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అరుదైన రికార్డు
యూఏఈ వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో ముగిసిన మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అరుదైన రికార్డు అందుకున్నాడు. మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్లు తౌహిద్ హృదోయ్, రిషద్ హొసెన్ వికెట్లు తీసిన సికందర్ రజా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో వంద వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో జింబాబ్వే తరఫున వంద వికెట్లు తీసిన ఐదో స్పిన్నర్‌గా రికార్డులకెక్కిన సికందర్ రజా ఓవరాల్‌గా జింబాబ్వే తరఫున వంద వికెట్ల మార్క్ చేరుకున్న ఏడో బౌలర్‌గా నిలిచాడు. జింబాబ్వే తరఫున వంద వికెట్లు తీసిన స్పిన్నర్ల జాబితాలో ప్రాస్పర్ ఉత్సెయా (133 వికెట్లు) తొలి స్థానంలో ఉండగా, గ్రేమీ క్రీమర్ (121 వికెట్లు), గ్రాంట్ ఫ్లవర్ (104 వికెట్లు), రే ప్రైస్ (100 వికెట్లు) వరుసగా రెండు, మూడు, స్థానాల్లో నిలిచారు.రెండో ఆల్‌రౌండర్‌గా..దీంతో పాటు సికందర్ రజా మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వంద వికెట్లు తీయడం ద్వారా సికందర్ రజా వన్డేల్లో జింబాబ్వే తరఫున 4వేల పరుగులు, వంద వికెట్లు తీసిన రెండో ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. సికందర్ రజా ఇప్పటివరకు 160 మ్యాచ్‌ల్లో 4,708 పరుగులు చేయడంతో పాటు వంద వికెట్లు తీశాడు. ఇక జింబాబ్వే దిగ్గజం గ్రాంట్ ఫ్లవర్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. గ్రాంట్ ఫ్లవర్ 221 వన్డేల్లో 6,571 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 104 వికెట్లు తీశాడు.శనివారం అబుదాబి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో వెటరన్ బ్రెండన్ టేలర్(81), క్రెయిగ్ ఎర్విన్(93) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. షోర్ఫుల్ ఇస్లాం, సైఫ్ హసన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 33.4 ఓవర్లలో కేవలం 172 పరుగులకే కుప్పకూలింది. తంజిద్ హసన్(46) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా, సికందర్ రజా, వెల్లింగ్టన్ మసకాద్జా తలా రెండు వికెట్లు సాధించారు. సోమవారం జరగనున్న రెండో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి.ఇదీ చదవండి:తీవ్రంగా నిరాశపరిచిన శుబ్‌మన్ గిల్‘అతడి కోసం త్యాగం తప్ప నాకు మరో మార్గం లేదు’