-
తిమ్మాపురంను దత్తత తీసుకున్న జ్ఞాన సరస్వతి ఫౌండేషన్
కందుకూరు (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వారు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గత వారం రోజులుగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన 'సంస్కార వికాస సాధన యోగ విజ్ఞాన శిబిరం' సోమవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగాసనాలతో అలరించారు. -
ప్రతిభకు పురస్కారం..
‘జ్ఞానసరస్వతి’ సేవలు ప్రశంసనీయం రవీంద్రభారతిలో శనివారం జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. 121 మంది విద్యార్థినీ, విద్యార్థులు, ఐదుగురు హెచ్ఎంలు పురస్కారాలు అందుకున్నారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినీ విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం జ్ఞానసరస్వతీ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శనివారం రవీంద్రభారతిలో జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్ని వైపుల నుంచి వికాసం ఉంటుందన్నారు. సమాజానికి, దేశానికి ఉపయోగపడే పౌరులుగా విద్యార్థులు ఎదగాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తే ఎవరెస్ట్ ఎక్కిన పూర్ణ, ఆనంద్లాగా రాణిస్తారన్నారు. విద్యార్థుల్లో అన్ని సామర్థ్యాలు పెంపొందించేందుకు జ్ఞానసరస్వతీ ఫౌండేషన్ చేసే కృషి విలువకట్టలేనిదని తెలిపారు. హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్యభారతి స్వామిజీ మాట్లాడుతూ భారతీయుల్లో ఆధ్యాత్మికత మెండు అని తెలిపారు. ఆంగ్లేయుడు మెకాలే ఆంగ్లవిద్యను దేశంలో ప్రవేశపెట్టి మన సంస్కృతిని నాశనం చేశారన్నారు. సమాజానికి ఉపయోగపడే విద్యను అందరూ అభ్యసించాలని తెలిపారు. జిల్లా విద్యాధికారి సోమిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి నిజాయితీతో చదవాలన్నారు. జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు కోసం జ్ఞానసరస్వతీ ఫౌండేషన్ వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ వారి ఉన్నతి కృషి చేస్తుందని చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ చంపాలాల్ మాట్లాడుతూ జ్ఞానసరస్వతీ ఫౌండేషన్వారు ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను పొత్సహించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ, ప్రతిభా పురస్కారాలు అందజేయటం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా పదవ తరగతి ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 121 మంది విద్యార్థినీ-విద్యార్థులకు, జిల్లాలోని ఐదు మంది హెచ్ఎంలకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఆరవ తరగతి విద్యార్థినీ శ్రీహిత పాడిన వందేమాతర గీతం ఆకట్టుకుంది. సంధ్య, వైష్ణవీ, శారద, ఓంకార్‌ల నృత్యప్రదర్శలు ఆలరించాయి. కార్యక్రమంలో జిల్లా ఆర్వీఎం ప్రోగ్రాం ఆఫీసర్ కిషన్‌రావు, ప్రముఖ వ్యక్తిత్వ వికాసనిపుణులు ఆకెళ్ల రాఘవేంద్ర, యోగా గురువు శశిధర్, డిప్యూటీ ఈవో హరిచందర్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement