breaking news
GIGANTIC snake
-
భారీకొండ చిలువతో చిన్నారి ఆటలు, చూస్తే షాకవ్వాల్సిందే!
సాధారణంగా చాలామంది పాముని చూడగానే భయంతో వణికిపోతుంటారు. పాము ఉందంటే ఆ దరిదాపుల్లోకి వెళ్లటానికి కూడా ఇష్టపడరు. ఒక్కొసారి పాములు, కొండ చిలువలు దారితప్పి.. జనవాసాల మధ్యన, పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోనికి వస్తుంటాయి. లేదా చాలా తక్కువ మంది ఇళ్లలోనే పాములను పెంచుకుంటారు. అలాంటి వారు పాముకి బయపడకుండా వాటితో మంచి స్నేహాన్ని ఏర్పరుచుకుంటారు. తాజాగా ఓ చిన్నారి పెద్ద పాముతో ఎలాంటి బెరుకు లేకుండా ఆడుకుంటున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో అయిదారేళ్ల వయసున్న చిన్నారి రెడ్ కలర్ టీషర్టు ధరించి తన ఇంటి ఆవరణంలో ఆడుకుంటోంది. ఇంతలో అక్కడి భారీ కొండ చిలువ వచ్చింది. అయితే కొండచిలువను చూసిన చిన్నారి ఏమాత్రం భయపడలేదు. పైగా నవ్వుతూ పాము దగ్గరకు వెళ్తుంది. కొండ చిలువను పట్టుకొని దానితో ఆటలాడుతుంది. ప్రశాంతంగా పాము మీద పడుకుంటుంది. చిన్నారి పక్కన పాము పాకడం చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచినట్లు అనిపిస్తుంది. చదవండి: ‘మేరా ఫౌజీ అమర్ రహే’.. పెళ్లినాటి దుస్తుల్లో భర్తకు తుది వీడ్కోలు ఇక చిన్నారి వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. కొండచిలువతో ఆడిన పసిపాప ధైర్య హృదయాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుండగా, లక్షలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. కాగా చిన్నారి ఆడుకుంటున్న పాము శిక్షణ పొందిన పెంపుడు జంతువు అని తెలిసింది. చదవండి: ప్రేయసికి వెరైటీగా ప్రపోజ్ చేసిన ఆసీస్ మహిళ.. ఎలాగో చూడండి..! View this post on Instagram A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world) -
పొట్ట విప్పి చూడ ఎగ్స్ ఉండు..
నైజీరియాలోని ఓ ఊరిలో దూడలు మాయమైపోవడం మొదలైంది.. గ్రామస్తులంతా ఇదో కొండచిలువ పనేనని అనుమానించారు.. వెతికారు.. అప్పుడే దేన్నో లాగించేసి.. బాగా బలిసినట్లు కనిపిస్తున్న కొండచిలువ వారికి కనిపించింది.. తమ దూడలను మింగేస్తోంది ఇదేనంటూ దాన్ని చంపారు.. పొట్ట విప్పి చూశారు.. తీరా చూస్తే.. ఇదిగో ఇలా దాదాపు వంద గుడ్లు కనిపించాయట. ఈ చిత్రం ప్రస్తుతం నెట్లో హల్చల్ చేస్తోంది. కొందరు ఆ జీవిపై సానుభూతి ప్రకటిస్తుండగా.. మరికొందరు ఈ గుడ్లన్నీ కొండచిలువలైతే.. ఆ గ్రామం పరిస్థితి ఏమి కాను అంటూ సమర్థించారు. -
పొట్ట విప్పి చూడ ఎగ్స్ ఉండు..