breaking news
friendli policing
-
ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు.. గ్రేహౌండ్స్ రద్దు.. సీవీ ఆనంద్
సాక్షి ,హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు. అయితే సాధారణ ప్రజలను గౌరవిస్తామని రౌడీల, గుండాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.ఈ రోజు (బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మావోయిజం అంతమైందని అందుకే దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గ్రేహౌండ్స్ విభాగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.గ్రేహౌండ్స్ విభాగంలో పనిచేస్తున్న 1700 మంది సిబ్బందిని అత్యవసర విభాగాలైన సైబర్ క్రైమ్, నార్కోటిక్ శాఖలకు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. సైబర్‌క్రైమ్ ప్రస్తుతం పోలీసులకు సవాల్‌గా మారిందని అందుకే ఆ శాఖపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సైబర్ కేటుగాళ్ల ఆట కట్టించేందుకు పోలీస్ సిబ్బందికి అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా సైబర్ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న గంజాయ్,డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధం ప్రకటిస్తున్నాం. మాదక ద్రవ్యాల సరఫరా, విక్రయాలను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌లను త్వరలోనే పూర్తిగా ధ్వంసం చేస్తామని ప్రకటించారు. -
పోలీసుల ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా
హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా నగర పోలీసులు చర్యలు చేపడుతున్నారు. నగరంలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం పోలీసులు సోమవారం మెగా జాబ్‌మేళాను ఏర్పాటు చేశారు. అంబర్‌పేట ఇంపీరియల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఉదయం ఈ మెగా జాబ్ మేళాను సీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ మేళాలో పలు కంపెనీలో పాల్గొంటున్నాయి. ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరారు.


