అప్పులు తీర్చేందుకు ఆ అమ్మాయిలు..!
కేండిస్ కేషానీ ఓ మామూలు మధ్యతరగతికి చెందిన విద్యార్థిని. అయినా ఎలాంటి అప్పులు లేకుండా, ఆర్థిక చిక్కులు ఎదుర్కోకుండా ఆమె అమెరికాలోని విల్లానోవా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. నిజానికి ఆమెకు మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులు కలుపుకొని 50వేల డాలర్ల (రూ. 33.59 లక్షలు) వ్యయం అయింది. వచ్చినా స్కాలర్షిప్ ఏమూలకు సరిపోలేదు. ఈ నేపథ్యంలో ఆధునికతతో అందివచ్చినా ఓ అరెంజ్మెంట్.. ఆమెను ఆర్థిక చిక్కుల నుంచి బయటపడేసింది. ఎలాంటి అప్పులు లేకుండా మూడేళ్ల చదువు నిరాటకంగా పూర్తయ్యేలా చేసింది.
ఇప్పుడు పాశ్యాత్యదేశాల్లో విస్తృతంగా వినిపిస్తున్న ఆ అరెంజ్మెంటే 'షూగర్ డ్యాడీస్'. సంపన్నులైన పురుషులకు సహచరులుగా ఏకాంతంలో గడుపుతూ, అవసరమైనప్పుడు వారితో శృంగార కార్యకలాపాలు నెరిపితే.. అందుకు ప్రతిఫలంగా వారు ఆర్థిక సహాయం చేయడం అనేది ఈ 'షూగర్ డ్యాడీస్ కాన్సెప్ట్'. తన కష్టాల నుంచి గట్టెక్కేందుకు కేషాని డేటింగ్ సైట్లను వెతికి 'షూగర్ డ్యాడీ' రిలేషన్ షిప్స్ కొనసాగించింది. ఈ మూడేళ్ల కాలంలో పలువురితో గడిపి ఆమె తన చదువులను పూర్తి చేసింది. ఆర్థిక కష్టాలతో సతమతవుతున్న యువతులకు ఈ సదుపాయం ఎంతో అండగా నిలుస్తోందని కేషాని చెప్తున్నపటికీ దీనిపై తీవ్ర విమర్శలు లేకపోలేదు. మహిళల ఆర్థిక అవసరాలు, దుర్భర పరిస్థితులను ఆసరాగా చేసుకొని వారిని వ్యభిచార రొంపిలోకి దింపడమే 'షూగర్ డ్యాడీస్' కాన్సెప్ట్ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్కూలు, కాలేజీలు ఫీజులు చెల్లించేందుకు విద్యార్థినులతో సెక్స్ వర్క్, స్ట్రిప్పింగ్ (దుస్తులు విప్పడం), వ్యభిచారం, వెబ్‌క్యామ్ ముందు లైంగిక కార్యకలాపాలు చేయించడం అసాధారణమని నేవెడా లాస్‌వేగాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లిన్ కొమెల్లా చెప్పారు. అయితే, షూగర్ డ్యాడీ సైట్లలో వ్యభిచారం జరుగుతుందని పక్కాగా చెప్పలేమని, విద్యార్థినులకు ఇలా సాయం చేస్తున్నవారు శారీరక సుఖాలను కోరుతున్నప్పటికీ, శృంగారం అనేది కచ్చితంగా జరుగుతుందని చెప్పలేమని, తేలికైన స్థాయిలో జరిగే వ్యభిచారం ఇందులో కనిపిస్తోందని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్ రాన్ వీట్జర్ తెలిపారు.