డైరెక్టర్ లేకుండానే సినిమా.. శ్రీకృష్ణ దేవరాయలుగా సుదీప్
కన్నడ హీరో సుదీప్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఓ మాదిరిగా తెలియొచ్చేమో. 'ఈగ' విలన్ అంటే మాత్రం ఎక్కువగా గుర్తుపడతారు. సైరా, బాహుబలి లాంటి తెలుగు చిత్రాల్లోనూ అతిథి పాత్రలు చేసినప్పటికీ ప్రస్తుతం సొంత భాషకే ఎక్కువగా పరిమితమైపోయాడు. ఈ రోజు సుదీప్ పుట్టినరోజు సందర్భంగా క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు)తెలుగు ప్రముఖ నిర్మాణ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుదీప్ కాంబోలో తీస్తున్న కొత్త సినిమాకు 'దేవరాయ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మనందరికీ తెలిసిన శ్రీ కృష్ణ దేవరాయలు జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ గౌరహరి సంగీత దర్శకుడు. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ బాగుంది. అలానే ప్రాజెక్టుపై అంచనాలు పెంచేసింది.వచ్చే ఏడాది డిసెంబరులో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించడం వరకు బాగానే ఉంది. కానీ దర్శకుడు ఎవరనేది బయటపెట్టలేదు. ఇంకా డైరెక్టర్ ఎవరనేది ఫిక్స్ కాలేదా లేదంటే కావాలంటే పేరుని రివీల్ చేయలేదా అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. అలానే ఇది పాన్ ఇండియా మూవీనా కాదా అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు.(ఇదీ చదవండి: విజయ్ ప్రభుత్వంపై డైలాగ్స్.. 'జైలర్ 2' వాయిదా రూమర్స్.. తీరా చూస్తే)