breaking news
Cheer Leader
-
ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్‌లీడర్స్‌తో క్రికెటర్ల బంధం!
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వరుసగా సంచలన విషయాలు వెల్లడిస్తూ వస్తున్నాడు. ఇటీవలే ‘హ్యూమన్ బాంబే’ అనే పాడ్‌కాస్ట్‌కు లలిత్ మోదీ ఇంటర్వ్యూ ఇచ్చిన విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇప్పటికే లక్నో సూపర్‌జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాపై విరుచుకుపడిన లలిత్ మోదీ తాజాగా ఐపీఎల్ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన చీర్ లీడర్స్‌తో క్రికెటర్ల ప్రేమాయణాలకు సంబంధించిన విషయాలను బయపెట్టడం ఆసక్తి రేపింది. చీర్‌లీడర్స్ ఐపీఎల్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారనే ఉద్దేశంతోనే వారిని తీసుకొచ్చినట్లు పేర్కొన్నాడు. టోర్నమెంట్ సమయంలో జరిగే మైదానం వెలుపలి వివాదాలలో అధికభాగం ముందు రాసుకునే స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని తెలిపాడు. ఐపీఎల్ చూసే వీక్షకుల రేటింగ్‌లు పడిపోతే, హైప్ సృష్టించడం కోసం ఐపీఎల్ థింక్-ట్యాంక్ ఉద్దేశపూర్వకంగా మీడియాలో వార్తలను ప్రచారం చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక దక్షిణాఫ్రికా ఆటగాడు చీర్ లీడర్‌తో సంబంధం కొనసాగిస్తున్నాడన్న వార్తను తానే వ్యాప్తి చేశానంటూ లలిత్ మోదీ బాంబు పేల్చాడు.అయితే కొందరు క్రికెటర్లు చీర్‌లీడర్స్‌తో ప్రేమ మత్తులో మునిగి తేలుతున్నట్లు వార్తలు సృష్టించడం లాంటివన్నీ ముందే రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించాడు.ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించడం, వారు వ్యూయర్షిప్ కోసం దానికి మరింత హంగులు అద్ది రేటింగ్స్‌ను పెంచుకోవడానికి ఆయుధంలా వాడుకునేవారు. సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ చీర్ లీడర్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు తాము బహిరంగపరిచిన మాట వాస్తవమే. కానీ కొన్ని చానెళ్లు మాత్రం దిగజారి డికాక్ చీర్‌లీడర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ రాసుకొచ్చాయి. ఇది వారి టీఆర్పీ రేటింగ్‌ను పెంచేసి ఉండొచ్చు.. కానీ ఒక క్రికెటర్ కెరీర్‌కు ఇదొక మాయని మచ్చలా మిగిలిపోతుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సౌతాఫ్రికా డికాక్ ఆ చీర్లీడర్నే పెళ్లి చేసుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. ఈ నేపథ్యంలో చీర్ లీడర్స్‌ను పెళ్లి చేసుకున్న క్రికెటర్ల గురించి ఒక లుక్కేద్దాం.👉డికాక్, షాషా హర్లీ..సౌతాఫ్రికా సీనియర్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, షాషా హర్లీల ప్రేమకథ, వివాహబంధంలోకి అడుగుపెట్టడం ఒక చిన్నపాటి సినిమా కథలాగా ఉంటుంది. 2012లో చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ జరిగిన సమయంలో డికాక్ హైవైల్డ్ లయన్స్ తరఫున ఆడుతున్నాడు. అదే జట్టుకు షాషా హర్లీ చీర్‌లీడర్‌గా పనిచేసినట్లు సమాచారం. టోర్నీ జరిగిన సమయంలోనే డికాక్‌తో షాషా హర్లీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరు రిలేషన్షిప్లో మునిగి తేలారు. 2015లో నిశ్చితార్థం చేసుకున్న డికాక్, షాషాహర్లీలు మరుసటి ఏడాది వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2022లో ఈ జంట తమ మొదటి బిడ్డ కియారాకు స్వాగతం పలికారు. అప్పటినుంచి డికాక్ ఏ టోర్నీకి వెళ్లినా షాషా హర్లీ తన వెంటే వస్తూ అతన్ని ఉత్సాహంగా ఉంచుతుంది.👉మహ్మద్ షమీ, హసిన్ జహాన్..చీర్లీడర్ను పెళ్లిచేసుకున్న మరో క్రికెటర్ మహ్మద్ షమీ. 2012 ఐపీఎల్ సీజన్లో మాజీ మోడల్ హసీన్ జహాన్ చీర్‌లీడర్‌గా పనిచేసింది. ఈ సీజన్లోనే షమీ మొదటిసారి ఆమెను కలిశాడు. మాటల మధ్యలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం ఇద్దరు ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత 2014 జూన్ 6న మొరాదాబాద్‌లో కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత హసీన్ జహాన్ చీర్ లీడర్ పాత్రకు ఫుల్స్టాప్ పెట్టింది. 2015లో ఈ దంపతులు ఐరా షమీకి స్వాగతం పలికారు. అయితే నాలుగేళ్లకే వీరి వివాహబంధం ముగిసింది. షమీపై శారీరక వేధింపులు, గృహహింస కేసులు పెట్టిన హసీన్ జహాన్ షమీతో విడాకులు తీసుకొని విడిపోయింది. అలా క్రికెటర్లలో చీర్ లీడర్స్‌ను పెళ్లి చేసుకున్న ఇద్దరిలో ఒకరు తమ వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటే.. మరొకరు మాత్రం వివాహబంధం విచ్ఛిన్నం కావడంతో ఒంటరిగా మిగిలిపోయాడు. చదవండి: గంభీర్ తప్పుకోనున్నాడా? టీమిండియాకు కొత్త కోచ్! -
గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణంగా చంపేశాడు..
న్యూయార్క్ : ఓ చీర్ గర్ల్‌ను తన బాయ్‌ఫ్రెండ్ ఎవరికీ అనుమానం రాకుండా చంపేశాడు. ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్న తాము శారీరకంగా దగ్గరయ్యే క్రమంలో అనుమానాస్పదంగా ఆమె చనిపోయిందంటూ తొలుత నమ్మించినప్పటికీ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అతడు ప్రేమగానే తన గర్ల్‌ప్రెండ్‌ను దగ్గరకు తీసుకున్నా తర్వాత ఓ సైకోలాగ మారి ఆమెను శారీరకంగా హింసించి చంపేసినట్లు దర్యాప్తు బృందాలు తేల్చేశాయి. వివరాల్లోకి వెళితే మార్క్ హోర్టన్ అనే ఓ యువకుడు కేలీ మండాడి (19) అనే చీర్ గర్ల్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇటీవలె అతడితో డేటింగ్ వెళ్లిన కేలీ అనూహ్యంగా తీవ్ర గాయాల పాలయింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా అక్కడే ప్రాణాలు కోల్పోయింది. వారిద్దరు శారీరకంగా దగ్గరయ్యే క్రమంలో అనుమానాస్పందంగా ఆమె ప్రాణాలుకోల్పోయినట్లు మార్క్ చెప్పాడు. ఈ సంఘటన గత ఏడాది (2017) అక్టోబర్ 31న చోటు చేసుకుంది. అయితే, అతడిపై రేప్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా గతంలో కూడా అతడిపై లైంగిక దాడి నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నట్లు గుర్తించారు. సైకోలాగా మారి భౌతికంగా కేలీని హింసించిన కారణంగానే ఆమె చనిపోయినట్లు వైద్య నిపుణులు చెప్పారు. టెక్సాస్‌కు చెందిన కేలీ త్రినిటీ యూనివర్సిటీలో చీర్‌గర్ల్‌గా పనిచేస్తోంది. -
తొలి చీర్ లీడర్ ఓ మగాడు!
ఆ నేడు 2 నవంబర్ 1898 ఆడేవాళ్లను ఉత్సాహపరచడం, ఆటను చూసేవాళ్లను ఉల్లాసపరచడం చీర్ లీడర్ల విధి. ఆట డల్‌గా ఉన్నప్పుడు, ప్రేక్షకులు డీలా పడి ఉన్నప్పుడు సడెన్‌గా ఈ చీర్ లీడర్లు ప్రత్యేక్షమై ఆడి, పాడి.. స్టేడియం లోపల, బయట చురుకు పుట్టించి అదృశ్యమైపోతారు. క్రికెట్ బాగా పాపులర్ అయ్యాక ఈ చీర్లీడర్ల సంప్రదాయం ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించింది. నిజానికి ఈ సంప్రదాయం క్రికెట్‌తో మొదలవలేదు. అసలు ఆడవాళ్లతోనే మొదలవలేదు! 1898లో ప్రిన్స్టన్ యూనివర్శిటీ పట్టభద్రుడు థామస్ పీబిల్స్ అమెరికన్ ఫుట్‌బాల్ టీమ్‌ను ఉత్సాహపరిచేందుకు ఒక కార్యక్రమం ఏదైనా చేపట్టాలని అనుకున్నాడు. ఫుట్‌బాల్ అభిమానులను ఆనందడోలికల్లో ముంచెత్తేందుకు ఒక లీడర్ ఉంటే బాగుంటుందని అనుకున్నాడు. వెంటనే జానీ కాంప్‌బెల్ అనే విద్యార్థి ‘నేనుంటాను’ అని ముందుకు వచ్చాడు. పెద్దగా అరిచి, విజిల్స్ వేసే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించాడు. అలా 1898 నవంబర్ 2న జానీ కాంప్‌బెల్ ఫుట్‌బాల్ ఆట ద్వారా తొలి చీర్ లీడర్ అయ్యాడు. చరిత్రలో అదే తొలి ‘చీర్ లీడింగ్’ అయింది.


