-
లంపీ చర్మ వ్యాధి..: సంప్రదాయ చికిత్స
పశువుల చర్మంపై గడ్డల మారిదిగా వచ్చే ప్రాణాంతక వ్యాధి పేరు లంపీ చర్మ వ్యాధి. ఈ వ్యాధి గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో గో సంతతికి సోకింది. గత నెలలో గుజరాత్లో 5 జిల్లాల్లో 1,229 పశువులకు సోకింది. 39 పశువులు ప్రాణాలుకోల్పోయాయి. ఈ నేపథ్యంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రైతులకు ఇంటిపట్టున దొరికే సంప్రదాయ దినుసులతో కూడిన ఆయుర్వేద చికిత్సా పద్ధతులను రైతులకు అందుబాలోకి తెచ్చింది. లంపీ చర్మ వ్యాధి చికిత్సకు 2 పద్ధతులున్నాయి. 1) తినిపించే మందు: లంపీ చర్మ వ్యాధి చికిత్స కోసం సంప్రదాయ దినుసులతో నోటి ద్వారా తినిపించే మందు తయారు చేసే పద్ధతులు రెండు ఉన్నాయి. మొదటి విధానం: ఈ చికిత్సలో ఒక మోతాదుకు అవసరమయ్యే పదార్థాలు: తమలపాకులు 10, మిరియాలు 10 గ్రాములు, ఉప్పు 10 గ్రాములు. ఈ పదార్థాలన్నిటినీ గ్రైండ్ చేసి పేస్ట్‌లాగా తయారు చేయాలి. తయారు చేసిన పేస్ట్‌కు తగినంత బెల్లం కలిపి పశువుకు తినిపించాలి. మొదటి రోజున ఇలా తాజాగా తయారు చేసిన ఒక మోతాదు మందును ప్రతి 3 గంటలకోసారి పశువుకు తినిపించాలి. రెండో రోజు నుంచి.. రెండు వారాల పాటు.. రోజుకు మూడు సార్లు (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) తాజాగా తయారు చేసిన మందును తినిపించాలి. రెండవ విధానం: లంపీ చర్మ వ్యాధికి సంప్రదాయ పద్ధతిలో మందును రెండు మోతాదులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. వెల్లుల్లి 2 పాయలు, ధనియాలు పది గ్రాములు, జీలకర్ర పది గ్రాములు, తులసి ఆకులు గుప్పెడు, బిరియానీ ఆకులు పది గ్రాములు, మిరియాలు పది గ్రాములు, తమలపాకులు 5, ఉల్లిపాయలు చిన్నవి రెండు, పసుపు పది గ్రామలు, నేలవేము ఆకుల పొడి 30 గ్రాములు, కృష్ణ తులసి ఆకులు గుప్పెడు, వేపాకులు ఒక గుప్పెడు, నేరేడు ఆకులు ఒక గుప్పెడు.. ఇంకా బెల్లం వంద గ్రాములు. ఈ మందును కూడా ప్రతి సారీ తాజాగా తయారు చేయాలి. అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి, దానిలో బెల్లం కలపాలి. మొదటి రోజు ప్రతి 3 గంటల కోసారి తాజా మందు తయారు చేసి పశువుకు తినిపించాలి. రెండో రోజు నుంచి ప్రతిరోజూ మందును తాజాగా తయారు చేసి రోజుకు రెండుసార్లు చొప్పున పొద్దున్న, సాయంత్రం పశువు స్థితి మెరుగుపడే వరకు తినిపించాలి. 2) గాయంపై రాసే మందు: లంపీ చర్మం జబ్బు సోకిన పశువు చర్మంపై గాయం ఉంటే గనక, అందుకోసం ప్రత్యేకంగా సంప్రదాయ పద్ధతిలో మందు తయారు చేసి పై పూతగా పూయాలి. కావలసిన సామగ్రి: కుప్పింటాకులు 1 గుప్పెడు, వెల్లుల్లి పది రెబ్బలు, వేపాకులు ఒక గుప్పెడు, కొబ్బరి లేదా నువ్వుల నూనె 500 మిల్లీ లీటర్లు. పసుపు 20 గ్రాములు, గోరింటాకు ఒక గుప్పెడు, తులసి ఆకులు ఒక గుప్పెడు. తయారు చేసే విధానం.. అన్నిటినీ కలిపి మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేయాలి. దానిలో 500 మిల్లీ లీటర్ల కొబ్బరి లేదా నువ్వుల నూనె కలిపి మరిగించి, తర్వాత చల్లార్చాలి. రాసే పద్ధతి: గాయాన్ని శుభ్రపరచి దాని మీద ఈ మందును రాయాలి. గాయం మీద పురుగులు గనక ఉన్నట్లయితే.. సీతాఫలం ఆకుల పేస్ట్ లేదా కర్పూరం, కొబ్బరి నూనె కలిపి రాయాలి. National Dairy Development Board యూట్యూబు ఛానల్లో లంపీ చర్మ వ్యాధికి చికిత్సపై తెలుగు వీడియో అందుబాటులో ఉంది.. ఇలా వెతకండి.. Ethno-veterinary formulation for Lumpy Skin Disease-Telugu. -
పశు వ్యర్థాలతో కల్తీ నూనె తయారీకి యత్నం!
మాల్కాపూర్ అటవీప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సన్నాహాలు పరిగి: పశువుల వ్యర్థాలతో నూనెతయారీకి అక్రమార్కులు రంగం సిద్ధం చేసుకున్నారు. పరిగి మండల పరిధిలోని సయ్యద్‌మల్కాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సన్నాహాలు చేశారు. పశువుల చర్మం, కొవ్వు తదితర వ్యర్థాలతో దుర్వాసన రావడంతో విషయం శనివారం బయటకు పొక్కింది. దీంతో అక్రమార్కులు తమ బండారం బయటపడుతుందని తమ జాగ్రత్తల్లో మునిగిపోయారు. గ్రామాల్లో తయారీపై కన్ను.. ఇటీవల నగర శివారులోని కాటేదాన్ తదితర ప్రాంతాల్లో పశువుల వ్యర్థాలతో అక్రమార్కులు నూనె తయారు చేస్తుండడంతో అధికారులు, పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో అక్రమార్కుల కన్ను గ్రామాలపై పడింది. పరిగి ప్రాంతానికి చెందిన కొందరితో కుమ్మక్కై వ్యవసాయ పొలాలు, అటవీ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా కల్తీనూనె తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నూనె సరఫరాపై కూడా ఒప్పందాలు కుది రినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, తండాలే టార్గెట్.. ఇప్పటి వరకు వ్యాన్లలో నగరం నుంచి కల్తీనూనె తీసుకొచ్చి గ్రామీణ ప్రాం తాల్లో విక్రయిస్తూ వచ్చిన వ్యాపారులు తమ పంథా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. వ్యాపారులు నియోజకవర్గ పరిధిలో ఉన్న పరిగి, కుల్కచర్ల, గండేడ్ మండల పరిధిలోని పలు హాస్టళ్లకు తక్కువ ధరలకు ఆశచూపి కల్తీ నూనె సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఓ కల్తీ నూనె డబ్బాలు తరలిస్తు న్న వ్యాన్ పోలీసులకు పట్టుబడింది. ‘పెద్దల’ ఒత్తిడి పెరగడంతో పోలీసులు సదరు వాహనాన్ని వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement