breaking news
Bharat Stage emission standards
-
బీఎస్-7 వాహనాలపై కీలక అప్డేట్!
న్యూఢిల్లీ: దేశంలో వాహన కాలుష్యాన్ని నియంత్రణకు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికుల వాహనాలకు (ఎం1 కేటగిరీ) 2029 ఏప్రిల్ 1 నుంచి అత్యంత కఠినమైన ‘భారత్ స్టేజ్- VII’ (బీఎస్–7) ఉద్గార ప్రమాణాలను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ ముసాయిదా నోటిఫికేషన్‌పై 30 రోజుల పాటు ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది. ప్రస్తుతం దేశంలో 2020 ఏప్రిల్ నుంచి ‘బీఎస్–6’ నిబంధనలు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.మూడు దశల్లో కఠిన నిబంధనలుప్రస్తుత బీఎస్-6 ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తూ బీఎస్-7 నిబంధనలను మూడు దశల్లో (2029, 2031, 2035) అమలు చేయాలని ప్రతిపాదించారు. తొలి దశ (ఏప్రిల్ 2029) నుంచి తొలి దశలో కార్ల ఎగ్జాస్ట్, ఉద్గారాలతో పాటు ఇంధన, ఎలక్ట్రిక్ వినియోగం, ఈవీ బ్యాటరీ మన్నికపై నూతన నిబంధనలు అమలులోకి వస్తాయి. రెండో దశ (ఏప్రిల్ 2031)లో టైర్ల అరుగుదల, బ్రేక్ ప్యాడ్ల ఉద్గారాలపై కట్టడి మొదలవుతుంది. ఈవీలకు కిలోమీటరుకు 3 మిల్లీగ్రాములు, ఇతర వాహనాలకు 7 మిల్లీగ్రాములకు మించి బ్రేక్ డస్ట్ ఉండకూడదు. మూడో దశ (ఏప్రిల్ 2035) నుంచి అన్ని రకాల ఇంజిన్లు, ఈవీ వాహనాలకు బ్రేక్ కాలుష్య పరిమితిని కిలోమీటరుకు 3 మిల్లీగ్రాములకు తగ్గించనున్నారు.రోడ్డుపై రన్నింగ్‌లోనూ తనిఖీలు! ఈ ప్రతిపాదన ప్రకారం ఇకపై కేవలం ల్యాబ్‌లలోనే కార్లను పరీక్షించడమే కాకుండా, రోడ్డుపై వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు వెలువడే కాలుష్యాన్ని కొలిచే ‘రియల్ వరల్డ్ డ్రైవింగ్ ఎమిషన్’ (ఆర్డీఆ) పరీక్షలు తప్పనిసరి. ఇకపై కేవలం ల్యాబ్‌లలోనే కార్లను పరీక్షించడమే కాకుండా, రోడ్డుపై వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు వెలువడే కాలుష్యాన్ని కొలిచే ‘రియల్ వరల్డ్ డ్రైవింగ్ ఎమిషన్’ (ఆర్డీఈ) పరీక్షలు తప్పనిసరి. వాహనంలోనే ఉద్గారాలను పర్యవేక్షించే ఆన్–బోర్డ్ మానిటరింగ్ (ఓబీఎం) సిస్టమ్‌లు ఉంటాయి. ఇవి పరిమితికి 2.5 రెట్లు మించి కాలుష్యం వస్తే వెంటనే గుర్తిస్తాయి. ప్రతి వాహనానికి 8 ఏళ్లు లేదా 1,60,000 కి.మీల వరకు ఉద్గారాల గ్యారెంటీ ఉండాలి. గరిష్టంగా 10 ఏళ్లు లేదా 2,00,000 కి.మీల వరకు దీన్ని పర్యవేక్షిస్తారు.కొనుగోలుదారులకు వెహికల్ పాస్పోర్ట్వాహనాల ఉద్గారాలు, ఇంధన వినియోగం, బ్యాటరీ స్థితిగతులను వినియోగదారులు నేరుగా చూసుకునేందుకు ‘ఎని్వరాన్మెంటల్ వెహికల్ పాస్‌పోర్ట్’ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. వాహనంలో ఉన్న డిస్ప్లే స్క్రీన్ ద్వారా ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. అంతేకాకుండా ‘జియోఫెన్సింగ్’ సాంకేతికత ఉన్న పెట్రోల్, డీజిల్ వాహనాలను ‘బీఎస్–7–జీ’ కేటగిరీగా వర్గీకరిస్తారు. ఈవీ బ్యాటరీలపై తొలిసారిగా ఆంక్షలుఇప్పటివరకు కేవలం పెట్రోల్, డీజిల్ వాహనాలకే పరిమితమైన ఉద్గార నిబంధనలను తొలిసారిగా ఎలక్ట్రిక్, ప్లగ్–ఇన్ హైబ్రిడ్ వాహనాలకూ విస్తరిస్తున్నారు. ఈవీ బ్యాటరీ మన్నిక తొలి అయిదేళ్లు లేదా 1,00,000 కి.మీల వరకు కనీసం 75 శాతం పనితీరును కలిగి ఉండాలి. తదుపరి ఎనిమిదేళ్లు లేదా 1,60,000 కి.మీల వరకు కనీసం 67 శాతం పనితీరును నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. -
బీఎస్–3, బీఎస్–4 వాహనాల తేడాలివే..
పశ్చిమ గోదావరి జిల్లా : కాలుష్యపరంగా వాహన ప్రయాణాలు పెంచడం, రహదారుల ప్రమాదాలకు నివారణకు సుప్రీంకోర్టు చర్యల్లో భాగంగా(బీఎస్)–3 వాహనాల అమ్మకాలు మార్చి 31వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఎస్–3 ద్విచక్ర వాహనాలను మార్చి 31 తర్వాత కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ చేయవద్దని సుప్రీంకోర్టు అదేశాలతో ద్విచక్ర వాహన కంపెనీలు ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు ఇచ్చి డీలర్ల వద్ద ఉన్న వాహనాల విక్రయాలు ఆగమేఘాల మీద పూర్తిచేశాయి. ఇక ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్(బీఎస్)–4 వాహనాలు మాత్రమే విక్రయించాలని సుప్రీంకోర్టు సూచనల మేరకు అన్ని షోరూముల్లో కొత్తగా మార్పు చేసిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అసలు బీఎస్–3, బీఎస్–4 వాహనాలు అంటే ఏమిటి..? వాటి తేడాలు ఏమిటి..? వాటి ప్రత్యేకతలు ఏమిటి..? వంటి సమాచారం తెలుసుకుందాం. వాహన ఉద్గార నిబంధనలు ఇలా.. భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్స్ అనే సంస్థ వాహనాల్లోని వాయు కాలుష్యం, ఇంజిన్‌లోని అంతర్గత ప్రమాణాలు, స్పార్క్–ఇంజన్ ఇగ్నిషన్ తయారీలో కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి ఆధ్వర్యంలో వాహన ప్రమాణాలను పర్యవేక్షిస్తుంది. ఈ భారత్ స్టేజ్‌ని బీఎస్‌గా వ్యవహరిస్తున్నారు. వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యంమే ముఖ్యంగా బీఎస్–3 వాహనాలు కోర్టు ఆదేశాల మేర నిలిపివేశారు. బీఎస్–3 అనేది వాహన ఉద్గార ప్రమాణాలకు సంబం«ధించిన అంశాల్లో ప్రధానమైంది. దీని ద్వారా వాహనాల నుంచి వెలువడే కాలుష్యం ఎంత స్థాయి వరకు ఉండాలో నిర్ణయిస్తారు. వాయు కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్‌ను పరిశీలించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. బీఎస్–3 నుంచి వచ్చే ఉద్గారాల కంటే బీఎస్–4లో విడువలయ్యే ఉద్గారాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఉద్గారాల బట్టే కాలుష్య ప్రభావం ఆధారపడి ఉంటుంది. బీఎస్–3లో కిలోమీటర్‌కు 2.30 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ వెలువడేందుకు అనుమతి ఉంది. బీఎస్–4లో కిలోమీటర్‌కు గ్రాము కార్బన్ డయాక్సైడ్ వెలువడేందుకే పరిమితం చేశారు. దేశమంతా ఒకే విధానం కోసం.. ఇప్పటికే బీఎస్–4 ప్రమాణాలు కలిగిన వాహనాల వినియోగం కొన్ని నగరాల్లో దీన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ç2010 నుంచి ఢిల్లీ, నోయిడాతోపాటు 13 నగరాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీఎస్–4 విధానాన్ని తీసుకువస్తే వాయు కాలుష్యాన్ని లెక్కించవచ్చు. తద్వారా వాహనచోదకులు దేశంలో ఇతర ప్రాంతాల్లో దీన్ని దుర్వినియోగం చేయకుండా వాహన కాలుష్య స్థాయి తగ్గించవచ్చు. అలాగే సాంకేతికపరంగా బీఎస్–3 కంటే బీఎస్–4 మెరుగ్గా ఉంటుంది. బీఎస్–4 వాహనాల ధర బీఎస్–3 వాహనాల కంటే అధికంగా ఉంటుంది. ∙బీఎస్–4 విధానం అమల్లో ఉండటం వల్ల వాహనాల నాణ్యతా ప్రమాణాలు పెరుగుతాయి. ఇక పెట్రోల్ బంక్‌లలో మెరుగైన ఇంధనం కూడా లభ్యం అవుతుంది. దీనికి పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ బా«ధ్యత వహించనుంది. బీఎస్–4 మరో ప్రత్యేకత.. బండి ఆన్ చేయగానే ఆటోమేటిక్‌గా హెడ్ ల్యాంప్ వెలుగుతుంది. దీంతో పగటి వేళల్లో కూడా హెడ్‌లైట్ వెలుగుతూ ఉంటుంది. ఈ విధానం వల్ల మంచు ఎక్కువగా కురిసే ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎదురుగా వచ్చే వాహనదారులను అప్రమత్తంగా ఉంచేందుకు, ఉపయోగపడుతోందని, ప్రమాదాలను నివారించవచ్చునేది నిపుణుల ఆలోచన. ఇప్పటికే బీఎస్–4 కార్ల విక్రయాలు ప్రారంభమైనప్పటికీ ద్విచక్ర వాహనాలకు మినహాయింపు ఉండేది. ఏప్రిల్ ఒకటి నుంచి బీఎస్–4 ప్రమాణాలు గల ద్విచక్ర వాహనాలు మాత్రమే షాపుల్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.∙బీఎస్–4 ద్విచక్ర వాహనాలకు హెడ్‌లైట్ స్విచ్ లేకుండా మార్చు చేశారు. బీఎస్–4 ద్విచక్రవాహనం స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇంజన్‌కు ఉన్న అనుసంధానంతో హెడ్ లైట్ వెలుగుతుంది. కొత్త టెక్నాలజీతో వచ్చిన ద్విచక్ర వాహనానికి స్విచ్ వేసే అవకాశం ఇప్పుడు లేదు. బీఎస్–4లో మరో ప్రత్యేకత ఏమిటింటే.. ఐ3ఎస్ (ఐడియల్ స్టాప్ సిస్టం)గా మార్చుచేశారు. ఈ విధానంతో వాహనంపై వెళ్లినప్పుడు సిగ్నల్ వద్ద లేదా ఏదైనా చోట నిలిపినప్పుడు 30 సెంకడ్లలో వాహనం ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. మళ్లీ మనం వాహనం స్టార్ట్ చేసే అవకాశం లేకుండానే క్లచ్ నొక్కితే వాహనం స్టార్ట్ అవ్వడం ఐ3ఎస్ ప్రత్యేకత అని వాహన డీలర్లు చెబుతున్నారు.


