breaking news
bedsheet issue
-
తలగడలోని డస్ట్‌మైట్స్‌తో అలర్జీలు!
అలర్జీలతో బాధపడుతున్నప్పుడు దానికి కారణాలేమిటంటూ ఒక్కోసారి తలబద్ధలు కొట్టుకుంటూ ఉంటాంగానీ... ఒక్కోసారి అవి మన తల దగ్గరా లేదా మన కాళ్ల కిందా కూడా ఉండవచ్చు. అంటే... ఒక్కోసారి మన తలగడలోనే డస్ట్‌మైట్స్ నివసిస్తూ ఉండవచ్చు. లేదా మన కాళ్ల కింద ఉండే కార్పెట్లలోనైనా ఉండవచ్చు. దాదాపు 30 గ్రాముల దుమ్ములో కనీసం 14,000 వరకు డస్ట్‌మైట్స్ ఉండవచ్చని ఒక అంచనా. ఒక చదరపు గజం విస్తీర్ణంలో కనీసం 1,00,000 (లక్ష) డస్ట్ మైట్స్ ఉండవచ్చు. ఒక పరుపులో కనీసం కోటి డస్ట్‌మైట్స్ ఉంటాయని కూడా ఒక అంచనా. దుమ్ము కారణంగా అలర్జీ కలుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి దుమ్ములోని ఈ డస్ట్‌మైట్స్ వల్లనే అలర్జీ వస్తుంది. అవి విసర్జించే విసర్జకాల కారణంగా ఈ అలర్జీలు కలుగుతుంటాయి. ఒక్కో డస్ట్‌మైట్ తన జీవితకాలంలో 300 మిల్లీగ్రాముల విసర్జకాలను వెలువరిస్తుంది. ఒక్కోసారి ఆ అలర్జీలు కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకూ దారితీయవచ్చు. అందుకే... ఈ అలర్జీలను నివారించడానికి తాము ఉపయోగించే తలగడ తాలూకు పిల్లో కవర్లను తరచూ ఉతికి శుభ్రపరిచి వాడాలి. అలాగే వాక్యూమ్ క్లీనర్ల సహాయంతో మన కార్పెట్లను కూడా క్రమంతప్పకుండా శుభ్రపరుస్తూ ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది. (చదవండి: ఎంపీ సుప్రియా సూలే ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! 50 ఏళ్ల వయసులోనూ..) -
పోలీసుస్టేషన్లో దుప్పటి పంచాయితీ!
అనంతపురం సెంట్రల్: పోలీసుల దుప్పటి పంచాయితీతో తనకు అన్యాయం జరిగిందని పామిడికి చెందిన నూర్‌బాషా మనస్తాపంతో అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... నూర్‌బాషా కటిక వ్యాపారంలో మధ్యవర్తిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇమ్రాన్ అనే వ్యక్తితో కలిసి రకరకాల వ్యాపారాలు చేశాడు. ఇటీవల ఇమ్రాన్ 20 దున్నపోతులు విక్రయించు అని నూర్‌బాషాకు అప్పగించాడు. వీటిని రూ. 4లక్షలకు విక్రయించాడు. నూర్‌బాషాకు గతంలో ఇమ్రాన్ కొంతమొత్తం బాకీ ఉన్నాడు. దాన్ని పట్టుకుని మిగతా రూ.2లక్షల మేర ఇస్తానని చెప్పడంతో ఈ వ్యవహారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. రెండు రోజులుగా స్టేషన్లో పంచాయితీ జరుగుతోంది. పోలీసులు మాత్రం రూ. 3లక్షలు ఇవ్వాల్సిందేనని పంచాయితీ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని నూర్‌బాషా బుధవారం ఉదయం పురుగుమందు తాగి పోలీస్‌స్టేషన్‌లోనే కుప్పకూలిపోయాడు. బంధువులు వెంటనే నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు.


