-
ఎవర్గ్రీన్ బ్యూటీ.. బంజారా ఫ్యాషన్!
బంజారా రంగుల కళ మన ప్రాచీన సంస్కృతి గిరులలో వికసించి పురజనులలో మెరిసి మురిసింది ఎల్లలు దాటి విరాజిల్లుతూనే ఉంది ఎల్లవేళలా కనులవిందు చేస్తూనే ఉంది ఎవర్గ్రీన్ బ్యూటీ అని చాటుతూనే ఉంది రాజస్థానీ ఎంబ్రాయిడరీ కళ గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. రాజస్థానీయుల్లో చాలా మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వలసలు వచ్చి స్థిరపడ్డారు. అలా ఎంతో ప్రాచీనమైన వీరి వేషధారణ దేశమంతా తెలుసు. ఇప్పటికీ బంజారాలలో పూర్తి వేషధారణను 50 ఏళ్ల వారు ధరించడం చూస్తుంటాం. ఈ ఎంబ్రాయిడరీ కళ ఫ్యాషన్ పరిశ్రమలోకి ఎలా వచ్చింది? ఇంకా ఎంతలా కట్టిపడేస్తోంది? బంజారా దారపు పోగుల గొప్పతనం, అద్దాల మెరుపులు ఫ్యాషన్ వేదికల పై ఎంతగా హొయలు పోతున్నాయి.. వంటి విషయాలు ఫ్యాషన్ డిజైనర్ మంగారెడ్డి మాటల్లో.. బంజారా ఎంబ్రాయిడరీ వర్క్ కళ గురించి? రాజస్థానీ సంస్కృతిలోనే రంగుల వెలుగులు ఉన్నాయి. వీరు పింక్, ఎల్లో, రెడ్.. వంటి సహజసిద్ధమైన, కాంతిమంతమైన రంగులతో ‘లెహిరియా’ అనే టై అండ్ డై పద్ధతిని వాడుతుంటారు. రాజస్థాన్ ఎడారి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడి వేడి వాతావరణానికి తగ్గట్టుగా బ్యాక్‌లెస్ బ్లౌజ్‌లు వాడుతుంటారు. సంస్కృతి అనేది సౌకర్యాన్ని బట్టి మారుతుంటుంది. మోడర్న్ ఫ్యాషన్ రంగాన్ని బంజారా వర్క్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఫ్యాషన్ అంటేనే మన సంస్కృతి నుంచే ఏదో ఒకదానిని తీసుకుంటూ, కలుపుకుంటూ వెళ్లడం. బంజారా డ్రెస్సింగ్, ఆ వర్క్ సంస్కృతికి కళ తీసుకువచ్చేది. ఆ కళను ఆధునిక దుస్తులకు ఎంతో కొంత జతచేసినా మంచి లుక్ వస్తుంది. అందుకే, మోడర్న్ కట్‌కి ఇండియన్ వర్క్‌ని జత చేస్తూ వచ్చారు డిజైనర్లు. నెక్కి లేదా బార్డర్ లేదా ఫుల్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వాడి మిగతా ప్లెయిన్గానో చేస్తూ వైవిధ్యం తీసుకువచ్చారు. బంజారా అమ్మాయిలే ఒకప్పటిలా డ్రెస్ ధరించడానికి ఇష్టపడరు. ఈ కాలానికి తగ్గట్టుగా ఉండాలనుకుంటారు. అలాగని, వారి మూలాలను కాదనుకోలేరు. అలా కుర్తీ, టాప్, గౌన్.. ఇలా ప్రతి దాని మీద బంజారా వర్క్ తీసుకోవడం మొదలైంది. బంజారా వర్క్‌కి ఉన్న ప్రపంచ మార్కెట్? బంజారా వర్క్ వరల్డ్‌వైడ్ ఫేమస్ కావడంతో దీని మార్కెట్ మాటల్లో చెప్పలేనంత బాగుంది. ఈ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌ని విదేశీయులు బాగా ఇష్టపడతారు. చూసిన వెంటనే గుర్తిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆ విధంగా బాగా పాప్యులర్ అయ్యింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా ఈ వర్క్ బాగా రాణించిందని చెప్పచ్చు. రాజస్థానీ వాసి అయిన రూనాదేవి అనే స్వచ్ఛందృ సేవకురాలు లక్ష మందికి ఈ వర్క్ ద్వారా ఉపాధి చూపించింది. దీని ద్వారా విపరీతమైన మార్పు వచ్చింది. బంజారావర్క్లోని ఏదో ఒక అంశాన్ని అన్ని డ్రెస్సుల మీదకు ట్రాన్స్ఫర్ చేయడంతో టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా సినిమా తారలనూ ఆకట్టుకుంది. దీంతో కూడా అంతర్జాతీయ మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు ఈ వర్క్‌కి ఉన్న ట్రెండ్..? దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన గీతాంజలి సినిమాతో బంజారా వర్క్ మిగతా డ్రెస్సుల మీదకు ఎలా తీసుకోవచ్చో పరిచయం చేసినట్టు అయ్యింది. అప్పటినుంచి ప్రతి 2–3 ఏళ్లకోసారి ఈ వర్క్ ట్రెండ్‌లోకి వస్తూనే ఉంది. ఇప్పుడు ఇండియాలో టాప్ డిజైనర్ సునీత్ వర్మ బంజారా స్టైల్ మిర్రర్ వర్క్‌తో డ్రెస్ డిజైన్స్ చేస్తున్నారు. దీని వల్ల ఇప్పుడు మళ్లీ బంజారా వర్క్ ట్రెండ్‌లోకి వచ్చిందనే చెప్పవచ్చు. తరాలు మారినా బంజారా వర్క్ అనేది ఎప్పుడూ జీవనంలోనే ఉంటుంది. రాజస్థానీ ఫర్నిషింగ్లోనూ ఈ వర్క్ వాడుతుంటారు. ఫ్యాషన్‌లోనే కాకుండా వాల్ హ్యాంగింగ్స్, బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్.. వంటి వాటిలోనూ వాడుతారు. బంజారా ఎంబ్రాయిడరీ వర్క్‌ది ఆల్‌టైమ్ బ్యూటీ. ఎప్పటికీ కళగా కొత్తపుంతలు తొక్కుతూనే ఉంటుంది. మంగారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ -
బంజారాస్ పర్సనల్ కేర్
♦ మూడు నెలలకొక ఉత్పాదన ♦ కంపెనీ ఎండీ రమేష్ విశ్వనాథన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంజారాస్ బ్రాండ్‌తో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న విశాల్ పర్సనల్ కేర్ తన శ్రేణిని పెంచుతోంది. సహజ సిద్ధ వనమూలికలతో తయారైన 15 రకాల ఉత్పత్తులను ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తోంది. తాజాగా స్కిన్ పాజిటివ్ పేరుతో దానిమ్మతో తయారైన బ్యూటీ క్రీమ్‌ను విడుదల చేసింది. మూడు నెలలకు ఒక కొత్త ఉత్పాదన తీసుకొస్తామని విశాల్ పర్సనల్ కేర్ ఎండీ రమేష్ విశ్వనాథన్ ఈ సందర్భంగా మీడియాకు బుధవారం తెలిపారు. ఉత్పత్తుల అభివృద్ధికి ప్రత్యేక నిపుణులతో కూడిన ఆర్అండ్డీ బృందం నిమగ్నమైందని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.20 కోట్లతో ప్లాంటును ఏర్పాటు చేశామన్నారు. విస్తరణలో కంపెనీ.. హైదరాబాద్‌కు చెందిన విశాల్ పర్సనల్ కేర్ ఇప్పటికే చైనా, సింగపూర్, మలేషియా, ఒమన్, యూఏఈల్లో అడుగు పెట్టింది. ఈ ఏడాది మధ్యప్రాచ్య దేశాలు, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో విస్తరిస్తామని కంపెనీ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ వి.ఎస్.శ్రీనివాస్ తెలిపారు. 2015-16లో కంపెనీ రూ.60 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ ఏడాది రూ.100 కోట్లు లక్ష్యంగా చేసుకుంది. ఎగుమతుల ద్వారా 10% ఆదాయం ఆశిస్తోంది. అన్ని ప్రొడక్టులకు ఆయుష్, హలాల్, జీఎంపీ ధ్రువీకరణ ఉందని ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సుమిత్ బెనర్జీ వివరించారు. ఆయుర్వేద ఉత్పత్తులకే..: వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విపణి దేశంలో రూ.18,000 కోట్లుంది. ఇందులో 18-20 శాతం వృద్ధి రేటుతో ఆయుర్వేద ఉత్పత్తుల వాటా రూ.3,000 కోట్లుందని రమేష్ వెల్లడించారు. నాన్-ఆయుర్వేద విభాగం కేవలం 5-6 శాతమే వృద్ధి నమోదు చేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ విస్తరణకుగాను రూ.30 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్‌తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement