breaking news
Atmahyata
-
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
-
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
ప్రకాశం జిల్లా దర్శి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మంగళవారం రాత్రి ఉరివేసుకుని మృతిచెందాడు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన పునూరు వియ్‌కుమార్ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం తరగతి గదిలో పుస్తకాలు ఉంచేసి ఎటో వెళ్లిపోయాడు. రాత్రి కూడా హాస్టల్ కు రాలేదు. బుధవారం ఉదయం పాఠశాల పక్కనున్న షెడ్డులో ఉరివేసుకుని విగతజీవుడై కనిపించాడు. ఉరికి వేలాడుతున్న వినయ్‌కుమార్‌ను చూసి తోటి విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయునికి తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.