breaking news
AP Inter Results 2025
-
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో క్షణాల్లో చెక్ చేసుకోండిలా..
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు(AP Inter Results) శనివారం విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 70 శాతం, సెకండ్ ఇయర్లో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష రాసిన విద్యార్థులు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.క్లిక్ 👉🏼 ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్ క్లిక్ 👉🏼 సెకండ్ ఇయర్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్‌క్లిక్ 👉🏼 ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్‌క్లిక్ 👉🏼 సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్ AP Inter Results 2025.. ఎలా చెక్ చేసుకోవాలి.. ?➤ ముందుగా https://results.sakshieducation.com ను క్లిక్ చేయండి.➤పైన కనిపిస్తున్న లింక్‌లపై క్లిక్ చేయండి.➤ మీ హాల్‌టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.➤ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి. ➤ తర్వాతి స్క్రీన్‌లో ఫలితాలు డిస్ప్లే అవుతాయి.➤ భవిష్యత్ అవసరాల కోసం డౌన్లోడ్/ప్రింట్ అవుట్ తీసుకోండి.ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో చిత్తూరు లాస్ట్‌ఇదిలా ఉంటే.. ఇంటర్లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్ పరీక్షలను నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో ఇవాళ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. ఫస్ట్ , సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఫస్ట్ ప్లేస్‌లో కృష్ణా జిల్లా నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో గుంటూరు , ఎన్టీఆర్ జిల్లాలు నిలిచాయి. ఇక.. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో లాస్ట్ ప్లేస్‌లో సీఎం సొంతజిల్లా చిత్తూరు నిలవడం గమనార్హం. సెకండ్ ఇయర్ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. -
AP Inter Results: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రేపు(శనివారం) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష రాసిన విద్యార్థులకు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.ఇదిలా ఉంటే.. ఇంటర్లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్ పరీక్షలను నిర్వహించారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో రేపు, ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు.AP Inter Results 2025.. ఎలా చెక్ చేసుకోవాలి.. ?➤ ముందుగా https://results.sakshieducation.com ను క్లిక్ చేయండి.➤ "AP Inter 1st Year / 2nd Year Results 2025" అనే లింక్‌పై క్లిక్ చేయండి.➤ మీ హాల్‌టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.➤ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి. ➤ తర్వాతి స్క్రీన్‌లో ఫలితాలు డిస్ప్లే అవుతాయి.➤ భవిష్యత్ అవసరాల కోసం డౌన్లోడ్/ప్రింట్ అవుట్ తీసుకోండి.