-
ఫీజుకు డబ్బుల్లేక భార్య నగలమ్మిన అనిల్ అంబానీ.. ఎంతటి దుస్థితి!
ముఖేష్ అంబానీ గురించి తెలిసిన చాలా మందికి 'అనిల్ అంబానీ' గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. ముకేశ్ అంబానీ ప్రస్తుతం దేశంలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. కానీ అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ముఖేష్ అంబానీ మాదిరిగానే.. అనిల్ అంబానీ కూడా ఆసియాలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో ఒకరుగా ఉండేవారు. ఆ తరువాత అన్నతో వచ్చిన విభేదాలు.. ముందుచూపు లేని వ్యాపారాలు చేయడం వల్ల సంపన్నుల జాబితా నుంచి లాయర్ ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేకుండా పోయిన స్థితికి చేరారు. సరైన ప్రణాళిక, విజన్ లేకుండా ఏకకాలంలో అనిల్ అంబానీ ఎన్నో కంపెనీలను ప్రారంభించారు. టెలికామ్, పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్టైన్మెంట్ రంగాలలో గొప్ప సక్సెస్ సాధించాలని కలలు కన్నారు. కానీ ఈ కంపెనీలన్నీ అనుకున్న విజయం సాధించలేక పోయాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులు, సరైన ప్రణాళికలు లేకపోవడం, పెట్టుబడికి తగిన రాబడి లేకపోవడం వంటివి కుబేరుడైన అనిల్ అంబానీని అప్పుల్లోకి నెట్టడం ప్రారంభించాయి. అప్పులు పెరిగిపోవడంతో ఒక కంపెనీ తర్వాత మరో కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చింది. అనిల్ అంబానీ వ్యక్తిగత పూచీకత్తుపై చైనా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నా, తిరిగి చెల్లించలేకపోయారు. మూడు బ్యాంకులకు సుమారు రూ.5446 కోట్లను తిరిగి చెల్లించాలని ఆయన లండన్ కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. తన వద్ద డబ్బులు లేవని అనిల్ అంబానీ కోర్టులో చెప్పుకున్నారు. ఈయన మొత్తం అప్పు దాదాపు రూ.40,000 కోట్లు ఉంటుందని అంచనా. ముందు చూపు లేకపోవడం వల్ల రాజ్యాలు కూలిపోతాయి అనటానికి అనిల్ అంబానీ జీవితం ఓ ఉదాహరణ. ఇదీ చదవండి: వెయ్యి రూపాయలకు రూ.2 కోట్లు గిఫ్ట్ ఇచ్చాడు.. నువ్వు దేవుడు సామీ! లాయర్ల ఫీజు చెల్లించడానికి కూడా డబ్బు లేకపోవడం వల్ల.. అతను తన భార్య బంగారు నగలను అనిల్ అంబానీ విక్రయించినట్లు సమాచారం. తనకు కారు తప్ప మరేమీ లేదని, సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నానని ఆయన చెప్పుకున్నారు. ఫిబ్రవరి 2023 నాటికి అతని మొత్తం సంపద దాదాపు రూ. 250 కోట్లు, ముంబైలో 17 అంతస్తుల ఇంటిని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. -
ఒకప్పుడు షేర్ ధర రూ.2,700.. ఇప్పుడు ‘జిరో’.. భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు..
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ నుంచి త్వరలో డీలిస్ట్ అవ్వబోతుంది. రిలయన్స్ క్యాపిటల్‌ను హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కొనుగోలు చేసిన తరుణంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఇకపై దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ క్యాపిటల్ షేర్లు ట్రేడ్ అవ్వవు. ఎందుకంటే కంపెనీ కొత్త యజమాని హిందూజా గ్రూప్ షేర్లను డీలిస్ట్ చేయాలని నిర్ణయించటమే దీనికి ప్రధాన కారణం. వాస్తవానికి 2008లో కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.2,700 కంటే ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం షేర్ ధర దాదాపు 99 శాతం క్షీణించి రూ.11 వద్ద ఉంది. షేర్ల డీలిస్టింగ్ జరిగితే ఈక్విటీ షేర్ హోల్డర్ల ఇన్వెస్ట్మెంట్ సున్నా కాబోతోంది. కొత్తగా కొనుగోలు చేసిన కంపెనీ పాత కంపెనీలోని ఇన్వెస్టర్లకు ఎలాంటి వాటాలు ఇవ్వబోదని వెల్లడైంది. దీనివల్ల అనిల్ అంబానీ కంపెనీలో షేర్లు కలిగి ఉన్న వ్యక్తులకు భారీగా నష్టం జరగనుంది. ఇప్పటికే రిలయన్స్ క్యాపిటల్‌పై నియంత్రణ సాధించేందుకు హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ సమర్పించిన రూ.9,650 కోట్ల రిజల్యూషన్ ప్లాన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) గత మంగళవారం ఆమోదించింది. ఇదీ చదవండి: మరో గ్లోబల్ బ్రాండ్‌ను తీసుకొస్తున్న అంబానీ కంపెనీ ఇందులో రుణదాతలు 63 శాతం బకాయి నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అలాగే కంపెనీకి వ్యతిరేకంగా క్లెయిమ్ చేసిన మొత్తం రూ.38,526.42 కోట్లలో రూ.26,086.75 కోట్ల క్లెయిమ్‌లను మాత్రమే ట్రిబ్యునల్ ఆమోదించింది. -
అప్పులతో కుంగిన అనిల్ అంబానీ కంపెనీకి ఊరట..
ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్‌కి భారీ ఊరట లభించింది. రుణభారంతో కుంగిన రిలయన్స్ క్యాపిటల్‌కి సంబంధించి హిందుజా–ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రతిపాదించిన రూ. 9,650 కోట్ల పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం కంపెనీ రుణదాతలు భారీగా 63 శాతం రుణాలను వదులుకోవాల్సి వస్తుంది. అలాగే, ప్రణాళిక అమల్లో భాగంగా ఆర్‌క్యాప్ షేర్లను ఇండస్‌ఇండ్‌కు బదలాయించాక, దాన్ని స్టాక్ ఎక్స్చేంజీల నుంచి తొలగిస్తారు. మొత్తం రూ. 38,526 కోట్ల రుణాల క్లెయిమ్‌లకు గాను ఎన్సీఎల్టీ రూ. 26,086 కోట్ల క్లెయిమ్లనే అనుమతించింది. కానీ, 2023 జూన్‌లో బిడ్ వేసిన ఇండస్ఇండ్ అందులో రూ. 9,661 కోట్లు (37%) కడతానని ప్రతిపాదించింది. రిలయన్స్ క్యాపిటల్ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు మార్గాన్ని అందించడంలో ఎన్సీఎల్టీ ఆమోదం కీలకమని గమనించవచ్చు. -
అమ్మకు 90 ఏళ్లు : అంబానీ కుటుంబంసెలబ్రేషన్స్
వ్యాపారం ప్రపంచంలో అపరకుబేరుల్లా వెలుగుతున్న ఫ్యామిలీ అంబానీ. అలాంటి వంశ పార్యంపర్య వ్యాపారానికి వెన్నుముకగా నిలిచిన అద్భత మహిళ కోకిలాబెన్ అంబానీ అంటే అతిశయోక్తి కాదు. ధీరూభాయ్ వ్యాపార ప్రపంచాన్ని శాసించినా, ముఖేష్ అంబానీ ఆసియా కుబేరుడిగా అవతరించినా, దీని వెనుకున్న గొప్ప మహిళా మూర్తి కోకిలా బెన్. భార్యగా, తల్లిగా అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని అంబానీ కుటుంబానికి పెద్ద దిక్కుగా బలమైన అండగా నిలిచారు. దివంగత భర్త ధీరూభాయ్ అంబానీ కలలకు అండగా నిలవడమే కాకుండా, ఆయన మరణానంతరం కుమారులు ముఖేష్ అంబానీ , అనిల్ అంబానీను నిలబెట్టిన మాతృమూర్తి. ఈ రోజుతో ఆమెకు (ఫిబ్రవరి 24) 90 ఏళ్లు . అంబానీ ఫ్యాన్ ప్యాజ్ ఇన్‌స్టా ప్రకారం ఆమె బర్త్‌డేని పురస్కరించుకొని కోకిలాబెన కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, నీనా కొఠారి, దీప్తి సల్గావ్కర్, వారి జీవిత భాగస్వాములు ఆమె పుట్టినరోజు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. కోకిలాబెన్ అంబానీ తన పుట్టినరోజు సందర్భంగా టీనా అంబానీ, అనిల్ అంబానీలతో కలిసి ప్రత్యేకంగా రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లోని శ్రీనాథ్జీ ఆలయాన్ని శనివారం సందర్శించారు. 'మనోరత్ భోగ్', ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. శ్రీనాథ్జీ మందిర్ మండల్ బోర్డ్ వైస్ చైర్పర్సన్ కూడా అయిన కోకిలా బెన్ నాధ్‌ద్వారాలోని పుష్టి మార్గీయ ప్రధాన్ పీఠ్ శ్రీనాథ్జీ భవనంలో 56 నైవేద్యాలు సమర్పిస్తారు. ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియాలో కూడా కోకిలాబెన్ పూజలు చేశారు. అలాగే ఆంటిలియాలోని మందిరం దగ్గర పలువురు పండితులు కోకిలాబెన్ ఆరోగ్యం కోసం ప్రార్థన్లు చేశారు. గతంలో 2022లో ముత్యాల అంచుతో త్రీ స్టెప్స్ కేక్ అద్భుతమైన కేక్‌ను తయారుచేయించారు. ఇందులో విశేషం ఏమిటంటే, అంబానీ వంశానికి చెందిన ప్రతి సభ్యుని ఫోటోలు ఇందులో ఉన్నాయి. గుజరాత్లో జామ్ నగర్లో పుట్టిన ఆమె ఇష్టదైవం కృష్ణుడు. ఇష్టమైన కలర్ పింక్. ఆరోగ్యంగా ఉండేందుకు రోజూయోగ సాధన, చక్కటి ఆహారం తీసుకుంటారట. -
‘బెంజ్ టు బడ్జెట్ కారుకి పడిపోయిన అంబానీ బ్రదర్’
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అన్నది పెద్దలు చెప్పిన మాట. కానీ ఈ విషయంలో కొందరే విజేతలవుతుంటారు. పెట్రోల్ బంకులో కేవలం 300 రూపాయల జీతానికి పనిచేసిన ధీరూభాయ్ వేల కోట్లను సంపాదించి దిగ్గజ వ్యాపారవేత్తగా నిలిచారు. దేశంలోనే అతిపెద్దదైన రిలయన్స్ ఇండస్ట్రీని స్థాపించి అంబానీ వారసులకు బంగారు బాట పరిచారు. అయితే ఆయన వారసుల పరిస్థితి కొంచెం విచిత్రంగా ఉంటుంది. దీరుభాయ్ ఆయన పెద్ద కుమారుడు ముకేష్ దీరుభాయ్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, చిన్న కుమారుడు అనిల్ దీరూభాయ్ అంబానీ ఒకప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలి పది స్థానాల్లో ఉన్నారు. కానీ కాలం కలిసి రాక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మన దేశంలోనే ఎక్కువ మార్కెట్ విలువ ఉన్న కంపెనీ కాగా, అనిల్ అంబానీ సంస్థలు మాత్రం అప్పులు, కోర్టు కేసులు నడుస్తున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ఉన్న ఆస్తుల్ని అమ్మేస్తున్నారు. సాధారణ జీవితం గడుపుతున్నారు. తాజాగా, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం తిరిగి తన ఇంటికి వచ్చే సమయంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఓ సాదాసీదా హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లో తిరుగుతూ దర్శనమిచ్చారు. దీనిపై నెటిజన్లు అనిల్ అంబానీ గతం, వర్తమానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘జర్నీ మెర్సిడెజ్ టూ హ్యుందాయ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు అపరకుబేరుల జాబితాలో ఉన్న అనిల్ అంబానీ ఓ వెలుగు వెలిగారు. ‘అంబానీ’ల స్టేటస్ ఏ మాత్రం తగ్గకుండా రేంజ్ రోవర్ మెర్సిడెజ్ బెంజ్ ఎస్-క్లాస్, రోల్స్ రాయిస్ రోల్స్ రాయిస్ ఫాంటమ్, లంబోర్ఘిని గల్లార్డోలో తిరిగే వారు. కానీ అదంతా గతం ఇప్పుడు బ్లాక్ కలర్ హ్యుందాయ్ ఐయోనిక్ 5లో ప్రయాణిస్తున్నారు. ఇక అనిల్ అంబానీ ప్రయాణిస్తున్న కారు రూ.44.95 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) ప్రారంభం కాగా చివరికి రూ. 46.05 లక్షలకు (ఎక్స్-షోరూమ్) లభ్యమవుతుంది. ఈ కారు ప్రత్యేకతల విషయానికి వస్తే మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు 215 బీపీహెచ్ పవర్, 350 ఎన్ఎం టారిక్ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనం 72.6కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 631 కిమీ రేంజ్ వరకు ఉంది. హ్యుందాయ్ వెబ్సైట్ ప్రకారం ఈ కారు కేవలం 18 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. అదనంగా, 100 కి.మీ పరిధిని పొందడానికి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. View this post on Instagram A post shared by Voompla (@voompla)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement