breaking news
Alicia Cargile
-
గాళ్ ఫ్రెండ్‌తో ప్రముఖ నటి వివాహం
లాస్ ఏంజెలెస్: గత కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్న మహిళా సెలబ్రిటీలు మూడుముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు. హాలీవుడ్ ప్రముఖ నటి క్రిస్టిన్ స్టెవార్ట్(27), ఐర్లాండ్ మోడల్ స్టెల్లా మాక్స్వెల్(26) పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఓ పెర్ఫ్యూమ్ ప్రకటన కోసం అర్ధనగ్నంగా ఫొటోలకు పోజులిచ్చి వార్తల్లోకెక్కిన 'పర్సనల్ షాపర్' ఫేమ్ క్రిస్టిన్.. ఆ తర్వాత తన భాగస్వామి ఆడా.. మగా ఎవరో ఇప్పుడే చెప్పలేనంటూ వ్యాఖ్యలు చేసి తన అభిమానులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. గతేడాది నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న క్రిస్టెన్ స్టెవార్ట్, మోడల్ స్టెల్లాలు దక్షిణ కాలిఫోర్నియాలో తమ మ్యారెజ్ ప్లేస్‌గా ఫిక్సయ్యారని కథనాలు వచ్చాయి. పెళ్లిదుస్తులు , ఇతరత్రా సామాగ్రి కోసం షాపింగ్ మొదలుపెట్టారని వీరి సన్నిహితులు చెబుతున్నారు. పెళ్లిని వినూత్నంగా చేసుకోవాలని, సెలబ్రేషన్ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని డిజైనర్లను సంప్రదించారట. తన మాజీ గాళ్ ఫ్రెండ్ అలీసియా కార్గైల్‌తో ప్రేమాయణం నడిపిన నటి క్రిస్టెన్ విభేదాల తలెత్తడంతో బ్రేకప్ చెప్పేసింది. అప్పటినుంచి ఐర్లాండ్ మోడల్‌తో కలిసి ఉంటోంది. తొలుత నటుడు రాబర్ట్ పాటిన్సన్తో డేటింగ్ చేసిన క్రిస్టెన్ అతడితో బ్రేకప్ చేసుకుని ఆ తర్వాత సింగర్ స్టెఫానీ 'సోకో'తోనూ ప్రణయబంధాన్ని కొనసాగించింది. చివరికి మోడల్ స్టెల్లానే తన జీవితభాగస్వామి అంటూ ఇటీవల ప్రకటించింది. -
గాళ్ ఫ్రెండ్ తో కెమెరాకు చిక్కిన హీరోయిన్
లాస్ ఏంజెలెస్: తన గాళ్ ఫ్రెండ్ అలీసియా కార్జిల్ తో కలిసి రొమాంటిక్ లంచ్ కు వెళ్లిన హాలీవుడ్ స్టార్ హీరోయిన్, 'ట్విలైట్' కథనాయిక క్రిస్టన్ స్టివార్ట్ కెమెరాకు చిక్కింది. కార్జిల్ తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ లాస్ ఫెలిజ్ లోని రెస్టరెంట్ నుంచి స్టివార్ట్ బయటకు రావడం కెమెరా కంటపడిందని పీపుల్స్ మేగజీన్ వెల్లడించింది. స్టివార్ట్ తెలుపురంగు టీషర్ట్, నలుపు జెగ్గింగ్స్ ధరించి మెడలో గొలుసు వేసుకుంది. ఆమె గాళ్ ఫ్రెండ్ కాసువల్ బ్లాక్ టాప్ ధరించి, టోపి పెట్టుకుంది. తామిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నట్టు గతనెలలో స్టివార్ట్ వెల్లడించింది. కార్జిల్ తో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, ఆమె జీవితంలో మగాళ్లు ఎవరూ లేరని 26 ఏళ్ల 'కేఫ్ సొసైటీ' స్టార్ తెలిపింది. గతంలో గాయని స్టెఫానీ 'సోకో'తో ప్రణయబంధాన్ని స్టివార్ట్ కొనసాగించింది. అంతకుముందు నటుడు రాబర్ట్ పాటిన్సన్తోనూ డేటింగ్ చేసింది.