లండన్‌లో టీఆర్‌ఎస్‌సెల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు | christmas celebrations conducted by london nri trs cell | Sakshi
Sakshi News home page

లండన్‌లో టీఆర్‌ఎస్‌సెల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు

Dec 22 2016 11:24 PM | Updated on Sep 4 2017 11:22 PM

లండన్‌లో టీఆర్‌ఎస్‌సెల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు

లండన్‌లో టీఆర్‌ఎస్‌సెల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు

లండన్‌లోని ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌సెల్ ఆధ్వర్యంలో ఈస్ట్‌హోమ్‌లో గురువారం క్రిస్‌మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

రాయికల్ : లండన్‌లోని ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌సెల్ ఆధ్వర్యంలో ఈస్ట్‌హోమ్‌లో గురువారం క్రిస్‌మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. లండన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణవాదులు క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ మాట్లాడుతూ సీఏం కేసీఆర్ హయాంలో అన్నివర్గాల వారికి సముచిత స్థానం ఉందని, ఎలాంటి మతభేదాలు లేకుండా పండుగలు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం తెలంగాణ జాగృతి నాయకుడు హైదర్ ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నవీన్‌రెడ్డి, శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, అడ్వైజరి బోర్డు చైర్మన్ వెంకట్‌రెడ్డి, సభ్యులు సత్యం, ప్రవీణ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement