టాటా ఏఐఏ నుంచి కొత్త బీమా ప్లాన్ | Tata AIA Life launches new plan 'Secure 7' | Sakshi
Sakshi News home page

టాటా ఏఐఏ నుంచి కొత్త బీమా ప్లాన్

Feb 9 2014 2:57 AM | Updated on Sep 2 2017 3:29 AM

టాటా ఏఐఏ నుంచి కొత్త బీమా ప్లాన్

టాటా ఏఐఏ నుంచి కొత్త బీమా ప్లాన్

ఇటు టర్మ్, అటు ఎండోమెంట్ ప్లాన్‌ల కలయికతో టాటా ఏఐఏ లైఫ్ కొత్తగా సెక్యూర్ 7 పేరిట బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.

 ఇటు టర్మ్, అటు ఎండోమెంట్ ప్లాన్‌ల కలయికతో టాటా ఏఐఏ లైఫ్ కొత్తగా సెక్యూర్ 7 పేరిట బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒకవైపు బీమా రక్షణ కల్పిస్తూనే మరోవైపు గ్యారంటీ రాబడులు కూడా అందించేలా దీన్ని తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది. పాలసీ వ్యవధి 14 ఏళ్లు కాగా ప్రీమియం చెల్లింపు వ్యవధి ఏడేళ్లు ఉంటుందని పేర్కొంది. ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత ఏడేళ్ల పాటు హామీపూర్వక వార్షిక రాబడులు ఇది అందిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 25 శాతం మొత్తాన్ని పాలసీదారుకు కంపెనీ చెల్లిస్తుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement