సోనీ ఎక్స్పీరియా 'ఎక్స్ ఏ అల్ట్రా' కమింగ్ సూన్ | Sony Xperia XA Ultra India Launch Set for Monday | Sakshi
Sakshi News home page

సోనీ ఎక్స్పీరియా 'ఎక్స్ ఏ అల్ట్రా' కమింగ్ సూన్

Jul 23 2016 2:50 PM | Updated on Sep 4 2017 5:54 AM

సోనీ ఎక్స్పీరియా 'ఎక్స్ ఏ అల్ట్రా' కమింగ్ సూన్

సోనీ ఎక్స్పీరియా 'ఎక్స్ ఏ అల్ట్రా' కమింగ్ సూన్

సోనీ ఎక్స్పీరియా ఎక్స్ సిరీస్ లో తొలి స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల కానుంది.

సోనీ ఎక్స్పీరియా ఎక్స్ సిరీస్ లో తొలి   స్మార్ట్ ఫోన్ భారత  మార్కెట్లో  విడుదల కానుంది. సోనీ ఎక్స్ పీరియా 'ఎక్స్ఏ అల్ట్రా పేరుతో    సోమవారం లాంచ్ కానుంది.  'పర్ ఫెక్ట్ సెల్పీ కాంపేనియన్'  ను ఎక్స్ సిరీస్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల  చేయనున్నట్టు సంస్థ  ట్వీట్ చేసింది.   కాగా  ఫోన్ ని సంస్థ తన వెబ్ సైట్ లో గత మేనేలలో ప్రవేశపెట్టింది.
 

 'ఎక్స్ఏ అల్ట్రా  ఫీచర్ల విషయానికొస్తే...
ఆరు అంగుళాల టచ్ స్క్రీన్
1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టాకోర్ ప్రాసెసర్,
3జీ ర్యామ్, 16 జీబీ అంతర్గత మెమొరీ,
ఎస్డీ కార్డుతో  200 జీబీ  ఎక్స్ పాండబుల్ మెమొరీ
 21.5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా  విత్ ఎక్స్ మోర్ ఆర్ఎ స్ సెన్సర్
16 మెగా పిక్సెల్  సెల్ఫీ కెమెరా విత్ 88  డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్ .
2700 ఎంఏహెచ్ బ్యాటరీ  (రెండురోజుల బ్యాటరీ లైఫ్).


10  నిమిషాల చార్జింగ్ తో 5.5  గంటల పాటుపని చేస్తుందని కంపెనీ చెబుతోంది.  202  గ్రా. ల బరువు తూగే ఈ  స్మార్ట్ ఫోన్ వైట్, గ్రాఫైట్ బ్లాక్, లైమ్ గోల్డ్ రంగుల్లో అందుబాటులోకి  రానుంది అంచనా.  ఈ ఫోన్  ధర, తదితర వివరాలు లాంచింగ్ సందర్భంగా వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement