'సోషల్ మీడియాలో చురుగ్గా ఉండండి' | Sakshi
Sakshi News home page

'సోషల్ మీడియాలో చురుగ్గా ఉండండి'

Published Thu, Apr 30 2015 6:18 PM

'సోషల్ మీడియాలో చురుగ్గా ఉండండి' - Sakshi

ఇండోర్: రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, యువతతో అనుసంధానమయ్యేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని రాహుల్ గాంధీని కోరారు. రాహుల్ గాంధీని కార్నర్ చేసేందుకు బీజేపీ ప్రొఫెషనల్స్ ను మొహరించిందని దిగ్విజయ్ అన్నారు. అలాగే తమ నాయకుడికి గురించి తప్పుడు సమాచారమిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.

వీటికి తగిన సమాధానం చెప్పాలంటే సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని రాహుల్ తో చెప్పానని తెలిపారు. ఇప్పటివరకు ఆయనకు ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాలు లేవని చెప్పారు. యువతలో తనుకున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలో రాహుల్ అధికారిక ఎకౌంట్ ప్రారంభించాలని దిగ్విజయ్ సూచించారు. రాహుల్ గాంధీ నాయత్వంపై కొంత మంది కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేసిన అనుమానాలపై స్పందించేందుకు దిగ్విజయ్ నిరాకరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement