ఖాళీలు వేలల్లో.. నియామకాలు వందల్లోనా? | R. Krishnaiah comments on cm kcr! | Sakshi
Sakshi News home page

ఖాళీలు వేలల్లో.. నియామకాలు వందల్లోనా?

Feb 19 2016 12:42 AM | Updated on Sep 3 2017 5:54 PM

ఖాళీలు వేలల్లో.. నియామకాలు వందల్లోనా?

ఖాళీలు వేలల్లో.. నియామకాలు వందల్లోనా?

లక్షల్లో ఉద్యోగాల జాతర అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో అమలు తీరుకు ఎక్కడా పొంతన లేదని...

బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: లక్షల్లో ఉద్యోగాల జాతర అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో అమలు తీరుకు ఎక్కడా పొంతన లేదని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వశాఖల్లో వేలాదిగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వందల్లో నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం శోచనీయమన్నారు. గురువారం హైదరాబాద్ అంబర్‌పేటలో జరిగిన నిరుద్యోగ జేఏసీ గర్జనసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణవ్యాప్తంగా 2 లక్షల భర్తీ కోసం తక్షణమే నోటిఫికేషన్‌లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగాలను 439 నుంచి 3,500 పెంచాలని, 1,200 గ్రూప్-1, 8,000 గ్రూప్-3, 36,000 గ్రూప్-4 ఉద్యోగాల కోసం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ, జూనియర్, డిగ్రీ, ఎయిడెడ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయ పోస్టులను 15,600 నుంచి 39 వేలకు పెంచాలన్నారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు నీల వెంకటేశం, తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్, నిరుద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement