పోలీసులను ఆశ్రయించిన పోర్న్ స్టార్ | Porn star sues her Russian parents after they changed the locks at their home | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన పోర్న్ స్టార్

Oct 30 2015 3:35 PM | Updated on Sep 3 2017 11:44 AM

పోలీసులను ఆశ్రయించిన పోర్న్ స్టార్

పోలీసులను ఆశ్రయించిన పోర్న్ స్టార్

తాను ఎంచుకున్న వృత్తి గురించి తెలియడంతో తనను కూతురిగా అంగీకరించడం లేదని ఫిర్యాదు చేసింది.

చెల్యాబిన్ స్క్: తల్లిదండ్రులు తనను ఇంట్లోకి రానీయడం లేదని రష్యా పోర్న్ స్టార్ ఒకరు పోలీసులను ఆశ్రయించింది. తాను ఎంచుకున్న వృత్తి గురించి తెలియడంతో తనను కూతురిగా అంగీకరించడం లేదని ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్ అవుతుందనుకున్న తమ కూతురు పోర్న్ స్టార్ గా తిరిగిరావడంతో వ్లాదిస్లావా జాత్యగలోవా తల్లిదండ్రులు ఆమెకు ఇంట్లోకి రానీయలేదు. తలుపులకు తాళాలు వేసుకున్నారు.

ఇంట్లో ఉన్న తన వస్తువులు తీసుకెళ్లడానికి కూడా అనుమతించలేదని వ్లాదిస్లావా ఫిర్యాదులో పేర్కొంది. గతంలో తల్లిదండ్రులు తనను హింసించారని కూడా ఆరోపించింది. తనను భౌతికంగా, మానసికంగా హించారని వాపోయింది. 20 ఏళ్ల వ్లాదిస్లావా... సోఫీ గోల్డ్ ఫింగర్ పేరుతో పలు పోర్న్ చిత్రాల్లో నటించింది. తన తల్లిదండ్రులు సంకుచితంగా ఆలోచిస్తున్నారని ఆమె మండిపడింది. పోర్న్ చిత్రాల్లో నటిస్తున్నాననే కారణంతో తనను ఇంట్లోకి రానీయపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. సమాజంలో పరువు ప్రతిష్ఠలు పోతాయనే భయంతో కూతురుగా అంగీకరించేందుకు తన తల్లిదండ్రులు జంకుతున్నారని తెలిపింది.

అయితే వ్లాదిస్లావాతో మాట్లాడేందుకు కూడా ఆమె తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. లాయర్ ఆండ్రీ టెమ్నికోవ్ ద్వారా ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. తమపై చేసిన ఆరోపణలపై దావా వేస్తామని ఆమెను వ్లాదిస్లావా తల్లిదండ్రులు హెచ్చరించారని స్థానిక మీడియా తెలిపింది.

Advertisement

పోల్

Advertisement