'సూది సైకో' కోసం గాలింపు తీవ్రం | police hunting for needle psycho in west godavari district | Sakshi
Sakshi News home page

'సూది సైకో' కోసం గాలింపు తీవ్రం

Aug 30 2015 11:12 AM | Updated on Aug 21 2018 5:51 PM

'సూది సైకో' కోసం గాలింపు తీవ్రం - Sakshi

'సూది సైకో' కోసం గాలింపు తీవ్రం

పశ్చిమగోదావరి జిల్లాలో విద్యార్థులు, మహిళలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న ఇంజక్షన్ సైకో కోసం పోలీసుల గాలింపు తీవ్ర తరం చేశారు.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో విద్యార్థులు, మహిళలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న ఇంజక్షన్ సైకో కోసం పోలీసుల గాలింపు తీవ్ర తరం చేశారు.  అందులోభాగంగా మెడికల్ రిప్రజెంటేటీవ్స్తో ఆదివారం పోలీసు ఉన్నతాధికారులు ఏలూరులో సమీక్ష నిర్వహించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో పని చేసి మానివేసిన కాంపౌండర్ల వివరాలను కూడా సేకరిస్తున్నారు.

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇంజక్షన్లు విక్రయించవద్దని ఈ సందర్భంగా మెడికల్ షాపులకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సైకో కోసం జిల్లావ్యాప్తంగా 15 చెక్పోస్ట్లు ఏర్పాటు చేశారు. అలాగే 40కి పైగా ప్రత్యేక పోలీసులు బృందాలు సైకో కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడి ఊహాచిత్రం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాల్లో పోలీసులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement