కొత్త ప్రపంచాల కోసం వెతకండి!

కొత్త ప్రపంచాల కోసం వెతకండి!


అన్వేషించాలంటూ నాసా పిలుపువాషింగ్టన్‌: మన సౌర వ్యవస్థ అంచుల్లో, లేదా చుట్టుపక్కల ఏవైనా కొత్త ప్రపంచాలు ఉన్నయోమోనని కనుగొనేందుకు నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(నాసా) ప్రజల సహకారం కోరుతోంది. మన సౌర వ్యవస్థలో 8 గ్రహాలు ఉన్నట్లు ఇప్పటిదాకా భావిస్తున్నాం. తొమ్మిదో గ్రహం కూడా ఉండవచ్చనీ, అది సౌరవ్యవస్థకు చుట్టుపక్కల ఎక్కడైనా లేదా సౌర వ్యవస్థలోనే మిగిలిన గ్రహాలకు బాగా దూరంగా ఉండొచ్చని తాజాగా నాసా శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీనిని గుర్తించేందుకు పౌర శాస్త్రవేత్తలను నాసా ఆహ్వానిస్తోంది. ఇందుకోసం నాసాకు చెందిన వైడ్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సర్వే ఎక్స్‌ప్లోరర్‌ (వైజ్‌) అనే అంతరిక్ష వాహక నౌక తీసిన కొన్ని కొన్ని ఫొటోలను కలిపి చిన్న చిన్న వీడియోలుగా శాస్త్రవేత్తలు రూపొందించారు.ఆకాశంలో క్రమంగా కదులుతున్న వస్తువులపై ప్రధానంగా దృష్టి పెట్టేలా ఈ వీడియోలు ఉంటాయి. backyardworlds.org/  అనే వెబ్‌సైట్‌లో ఈ వీడియోలు అందుబాటులో ఉంటాయి. ప్రజలు వీటిని చూసి ఏవైనా కొత్త ప్రపంచాలు ఉన్నట్లుగా అనిపిస్తే నాసాకు తెలియజేవచ్చు. 8 గ్రహల తర్వాత రెండు మర్రగుజ్జు గ్రహాలను కూడా శాస్త్రవేత్తలు గుర్తించడం తెలిసిందే. తొమ్మిదవ గ్రహం ఎక్కడ ఉందో, వాటి ద్రవ్యరాశి ఎంతో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం అది కనుగొనే పనిలో శాస్త్రజ్ఞులు ఉన్నారు.

Back to Top