జెట్‌ ఎయిర్‌ వేస్‌ సమ్మర్‌ కూల్‌ ఆఫర్‌ | Jet Airways Announces Summer Sale, Offers Tickets At Rs. 1,294 | Sakshi
Sakshi News home page

జెట్‌ ఎయిర్‌ వేస్‌ సమ్మర్‌ కూల్‌ ఆఫర్‌

Apr 8 2017 10:19 AM | Updated on Jun 4 2019 6:19 PM

జెట్‌ ఎయిర్‌ వేస్‌  సమ్మర్‌ కూల్‌ ఆఫర్‌ - Sakshi

జెట్‌ ఎయిర్‌ వేస్‌ సమ్మర్‌ కూల్‌ ఆఫర్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌ సమ్మర్‌ బ్రేక్స్‌ పేరుతో తక్కువ ధరల్లో విమాన టికెట్లను ప్రకటించింది.

ముంబై:  విమానయాన సంస్థలు  సమ్మర్‌ లో కూల్‌ ఆఫర్లతో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే  ఇండిగో దేశీయ రూట్లలో తగ్గింపు విమాన టికెట్లను ఆఫర్‌ చేయగా  మరో ఎయిర్‌ లైన్స్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌  కూడా డిస్కౌంట్‌ ధరలను ఆఫర్‌ చేస్తోంది. సమ్మర్‌ బ్రేక్స్‌  పేరుతో తక్కువ ధరల్లో  విమాన టికెట్లను  ప్రకటించింది. దేశీయ రూట్లలో  తమ ప్రయాణికులకు సమ్మర్ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ట్విట్టర్‌ ద్వారా జెట్‌ ఎయిర్‌ వేస్‌  ఈ ఆఫర్‌ వివరాలను షేర్‌  చేసింది.  ఎకానమిక్‌ క్లాస్‌ టికెట్లలో  రూ. 1,294 నుంచి మొదలయ్యే ధరలను  అందుబాటలోకి తెచ్చింది. 

ఈ ఆఫర్‌ కింద 20 రోజుల ముందు టికెట్లను బుక్‌  చేసుకోవాలి.  ఏప్రిల్‌ 7-9 తేదీల మధ్యఈ  టికెట్లను బుక్‌ చేసుకోవాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ ట్విట్టర్‌ద్వారా తెలిపింది. అలాగే స్పెషల్‌ఆఫర్‌ లో  ఎకానమిక్‌ క్లాస్‌ టికెట్లను  ప్రీమియం క్లాస్‌ గా అప్‌గ్రేడ్‌  చేసే అవకాశం ఉందని పేర్కొంది.  అయితే ఈ ఆఫర్‌ లో ఎన్ని సీట్లుఅందుబాటులోఉండనున్నదీ స్పష్టం చేయలేదు.  
 

 

Advertisement
 
Advertisement
Advertisement