'ఉక్కు మహిళ'కు ఎట్టకేలకు విముక్తి | Irom Sharmila Says Happy to be Released, But Will Continue Fast | Sakshi
Sakshi News home page

'ఉక్కు మహిళ'కు ఎట్టకేలకు విముక్తి

Aug 20 2014 6:15 PM | Updated on Sep 2 2017 12:10 PM

'ఉక్కు మహిళ'కు ఎట్టకేలకు విముక్తి

'ఉక్కు మహిళ'కు ఎట్టకేలకు విముక్తి

14 ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్న మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలకు ఎట్టకేలకు విముక్తి లభించింది.

ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో 14 ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్న మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని ఆస్పత్రి నుంచి ఆమె బుధవారం విడుదలయ్యారు. తనను విడుదల చేయడం పట్ల ఇరోమ్ షర్మిల సంతోషం వ్యక్తం చేసింది.

సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌ పై వెనక్కు తగ్గబోనని స్పష్టం చేసింది. నిరాహారదీక్ష కొనసాగిస్తానని ఆమె తెలిపింది. ఆస్పత్రి ప్రత్యేక వార్డులో ఉంచి ఇప్పటివరకు బలవంతంగా ఆమెకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఆమె ఉంటున్న గదినే సబ్ జైలుగా మార్చారు. అయితే ఇరోమ్ షర్మిలను విడుదల చేయాలని మణిపూర్ కోర్టు ఆదేశించడంతో ఆమెకు విముక్తి ప్రసాదించారు.

Advertisement
 
Advertisement
Advertisement