బెంగళూరు : దేశీయ రెండో అతిపెద్ద సాప్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇన్ఫోసిస్‌కు కేటాయించిన తన మేజర్ కాంట్రాక్టును రాయల్ బ్యాంకు ఆఫ్ స్కాంట్లాండ్(ఆర్బీఎస్) రద్దుచేసింది. ఈ కాంట్రాక్ట్‌ను రద్దుతో కంపెనీలో 3 వేల మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు ప్రమాదంలో పడనున్నట్టు తెలుస్తోంది. అంతేకాక ఈ ప్రాజెక్టు నష్టంతో 40 మిలియన్ డాలర్ల రెవెన్యూలకు ప్రమాదం కూడా వాటిల్లనుంది. యూకేలో విడిగా బ్యాంకును ఏర్పాటుచేయాలన్న ఆలోచనతో 300 మిలియన్ యూరోల విలియమ్స్ అండ్ గ్లిన్ ఐటీ కాంట్రాక్ట్‌ను ఇన్ఫోసిస్‌కు, ఐబీఎమ్‌కు ఆర్బీఎస్ అప్పజెప్పింది.ఆ కాంట్రాక్టులో మేజర్ పోర్షన్ 200 మిలియన్ డాలర్లు ఇన్ఫోసిస్ కే దక్కింది.
అయితే యూకే బ్యాంకు- విలియమ్స్ అండ్ గ్లిన్‌ను ప్రత్యేక స్వతంత్ర బ్యాంకుగా ఏర్పాటుచేసే ప్రణాళికను ఆర్బీఎస్ రద్దు చేయడంతో ఈ కాంట్రాక్టును ఇన్ఫోసిస్ కోల్పోయింది. విలియమ్స్ అండ్ గ్లెన్ పేరిట స్టాండలోన్ బ్యాంకును కేవలం యూకేకు పరిమితం చేయాలని భావించిన ఆర్‌బీఎస్‌కు సహకరించేలా దాదాపు 3వేల మంది ఇన్ఫోసిస్ టెక్కీలు పనిచేస్తున్నారు. ఇప్పుడీ ప్రాజెక్టు రద్దుతో వీరందరి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఆర్బీఎస్ ప్రకటన అనంతరం ఇన్ఫోసిస్ కూడా వచ్చే కొన్ని నెలలో 3వేల ఉద్యోగులకు స్వస్తి పలుకనున్నట్టు తెలుస్తోంది. ఎక్కువగా ఈ ఉద్యోగాల కోత భారత్‌లో ఉండనున్నట్టు తెలుస్తోంది.
డబ్ల్యూ అండ్ జీ ప్రొగ్రామ్ టెక్నాలజీ పార్టనర్‌గా ఇన్ఫోసిస్ కన్సల్టింగ్, అప్లికేషన్ డెలివరీ, టెస్టింగ్ సర్వీసులను అందిస్తోంది.అయితే ఇప్పటికే రెవెన్యూలు పెంచుకోవడంలో నిరాశలో ఉన్న ఇన్ఫీకి, ఈ కాంట్రాక్టు రద్దు రెవెన్యూలపై మరింత గండికొట్టనుంది. 40-50 మిలియన్ డాలర్ల రెవెన్యూలను ఇన్ఫీ కోల్పోతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ నష్టం మరోమారు కంపెనీ గైడెన్సు తగ్గించుకునేందుకు దారితీస్తుందని వెల్లడవుతోంది. ఏప్రిల్‌లో ఇన్ఫోసిస్ 11.5-13.6 శాతంగా ఉన్న గైడెన్సును 10.-12 శాతానికి తగ్గించింది.
3 వేలమంది ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్
Published Mon, Aug 15 2016 12:37 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్‌ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
‘అర్బన్’ పోరు రూ.3.55 కోట్లు
ఇడ్లీ పిండిపైనా 18 శాతం జీఎస్టీ: అప్పిలేట్ అథారిటీ
కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు)
వాన నీటిలో ‘పరుపు’ ప్రయాణం.. వీడియో వైరల్
బిలియనీర్ ఫ్రాంక్ స్ట్రోనాచ్ అరెస్ట్
దెయ్యం సినిమాలో మృణాల్.. మరి ఒప్పుకొంటుందా?
సంతకం చేయండి.. మార్పు డిమాండ్ చేయండి
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
వయనాడ్‌కే రాహుల్ టాటా!
తప్పక చదవండి
- చెల్లిని కాపాడబోయి నీట మునిగిన అక్క మృతి
- ఉబ్బసం రోగులకోసం చేప ప్రసాదం
- మావోయిస్టుల ఏరివేతకు ‘జల్‌శక్తి’
- T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
- పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
- ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
- పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. పోలీస్ డాగ్స్‌కు అరుదైన గౌరవం
- పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ ప్రయోగం
- Russia: భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలు వెలికితీత
Advertisement