అది 90 మీటర్ల ఎత్తున్న ప్రాచీన భవనం.
అది 90 మీటర్ల ఎత్తున్న ప్రాచీన భవనం. పురాతన కాలానికి చెందిన ఆ భవనాన్ని చారిత్రక సంపదగా గుర్తించి పరిరక్షించాలని పలువురు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం అవసాన దశకు చెందిన భవనాన్ని కూల్చేయాలని నిర్ణయించింది.
అంతే ఆ భవనం క్షణాల్లో నేలమట్టమైంది. దట్టమైన దుమ్ము ఆకాశంలోకి లేచింది. 90 మీటర్ల భవంతి కనురెప్పలు వాల్చే సమయంలో కూలి శిథిలాలుగా మారిపోయింది. వాయవ్య చైనా షాంగ్జీ ప్రావిన్స్‌లోని ప్రాచీన నగరం డాటోంగ్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఓ భారీ ప్రాచీన భవానాన్ని ప్రభుత్వం సోమవారం క్షణాల్లో నేలమట్టం చేసింది.