కలసి డాన్స్‌ చేయలేదని కాల్చిచంపాడు | Dancer shot dead by a man in Punjab | Sakshi
Sakshi News home page

కలసి డాన్స్‌ చేయలేదని కాల్చిచంపాడు

Dec 4 2016 5:22 PM | Updated on Sep 4 2017 9:54 PM

కలసి డాన్స్‌ చేయలేదని కాల్చిచంపాడు

కలసి డాన్స్‌ చేయలేదని కాల్చిచంపాడు

పంజాబ్‌లో బతీండా జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో దారుణం జరిగింది.

చండీగఢ్‌: పంజాబ్‌లోని బతీండా జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తనతో డాన్స్‌ చేసేందుకు నిరాకరించిన మహిళా డాన్సర్‌ను కాల్చి చంపాడు.


నిందితుడు డాన్సర్‌ను కాల్చిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడితో పాటు అతని స్నేహితులు ఇద్దరు, ఫంక్షన్‌ హాల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహ వేడుకలో అనూహ్యంగా కాల్పుల ఘటన జరగడంతో అంతా షాకయ్యారు. మృతురాలు ప్రెగ్నెన్సీతో ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పుల ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. జాతీయ మహిళ కమిషన్‌ ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది.

Advertisement
 
Advertisement
Advertisement