ఐస్క్రీమ్ పార్లర్ సెక్స్ కేసు: సీబీఐకి సుప్రీం నోటీసులు | Sakshi
Sakshi News home page

ఐస్క్రీమ్ పార్లర్ సెక్స్ కేసు: సీబీఐకి సుప్రీం నోటీసులు

Published Fri, Nov 22 2013 3:41 PM

CBI, Kerala get Supreme court notice in ice cream parlour sex case

న్యూఢిల్లీ:ఐస్క్రీమ్ పార్లర్ సెక్స్ రాకెట్ కేసుకు సంబంధించి కేరళ ప్రభుత్వానికి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.1990లో వెలుగు చూసిన ఐస్క్రీమ్ పార్లర్ సెక్స్ కేసులో పురోగతిని తెలియజేయాలంటూ నోటీసులు అందజేసింది. దీనిపై కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్చుతానందంన్ లేవనెత్తిన పిటీషన్ ను సుప్రీం విచారించింది. ఈ పిటీషన్ ను శుక్రవారం  రంజాన్ దేశాయ్, సి. నాగప్పన్ లతో కూడిన ధర్మాసనం విచారించి కేరళ ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేశారు.

 

రెండు దశాబ్దాల క్రితం చోటు చేసుకున్న ఈ రేప్ ఉదంతంపై 22 మందికి సంబంధం ఉన్నట్లు సీబీఐ తేల్చిచెప్పినా, వారి పేర్లను వెల్లడించలేదు. దీంతో అచ్చుతానందన్  సుప్రీం పిటీషన్ దాఖలు చేశారు. అప్పటి ఈ సంఘటనను మీడియా ఐస్క్రీమ్ పార్లర్ రేప్ కేసుగా అభివర్ణించింది. గతంలో  ఈ కేసును కేరళ హైకోర్టు తిరస్కరించింది.

Advertisement
Advertisement