బీఎస్పీ నేత ధర్మేంద్ర చౌదరి దారుణ హత్య | BSP Leader Dharmendra Chaudhary Shot Dead in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

బీఎస్పీ నేత ధర్మేంద్ర చౌదరి దారుణ హత్య

Jan 11 2015 7:46 PM | Updated on Sep 2 2017 7:34 PM

ఉత్తరప్రదేశ్ లో అలీగఢ్ లో బహుజన సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ధర్మేంద్ర చౌదరి దారుణ హత్యకు గురైయ్యారు.

అలీగఢ్: ఉత్తరప్రదేశ్ లో అలీగఢ్ లో బహుజన సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ధర్మేంద్ర చౌదరి దారుణ హత్యకు గురైయ్యారు. ఈ సభలో పాల్గొనేందుకు తన కారులో వెళుతున్న ఆయనను ఇద్దరు దుండగులు ఆపి తుపాకీతో కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. బన్నాదేవి ప్రాంతంలోని ఓల్డ్ నగర్ నిగమ్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు.

ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ద్రువీకరించారని పోలీసులు తెలిపారు. 2017లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అట్రౌలీ నుంచి పోటీ చేసేందుకు ధర్మేంద్ర టికెట్ సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement