అమెరికాలో కుప్పకూలిన యుద్ధ విమానం | B-1B bomber crashes in USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో కుప్పకూలిన యుద్ధ విమానం

Aug 20 2013 7:50 AM | Updated on Aug 24 2018 8:18 PM

అమెరికాలోనూ ఒక యుద్ధ విమానం కూలిపోయింది. అయితే, అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలకు ప్రమాదం మాత్రం వాటిల్లలేదు.

మన దేశంలో మిగ్ విమానాలు తరచు కుప్పకూలిపోయి, పైలట్ల ప్రాణాలు బలితీసుకోవడం తెలిసిందే. అదే తరహాలో అమెరికాలోనూ ఒక యుద్ధ విమానం కూలిపోయింది. అయితే, అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలకు ప్రమాదం మాత్రం వాటిల్లలేదు. దక్షిణ డకోటాలోని ఎల్స్వర్త్ ఎయిర్ఫోర్స్ బేస్ నుంచి బయల్దేరిన బి-1బి బాంబర్ విమానం మోంటానా ప్రాంతంలోని ఒక మారుమూల ప్రదపేశంలో కుప్పకూలిపోయిందని అమెరికా వైమానిక దళ వర్గాలు తెలిపాయి.
 
అయితే, అందులో ఉన్న ఇద్దరు పైలట్లు, మరో ఇద్దరు ఆయుధ సామగ్రి నిర్వహణ అధికారులు మాత్రం విమానం కూలిపోవడానికి కొద్ది సేపటి ముందే సురక్షితంగా బయటకు దూకేసినట్లు 28వ బాంబ్ విభాగానికి చెందిన కల్నల్ కెవిన్ కెన్నడీ తెలిపారు. వారి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా, కొద్దిపాటి గాయాలు మాత్రం అయ్యాయన్నారు. విమానం కూలడానికి కారణాలేంటో తెలుసుకోడానికి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement