ఆనందంగా ఉంది:అమితాబ్ బచ్చన్ | Amitabh Bachchan happy with polio eradication from India | Sakshi
Sakshi News home page

ఆనందంగా ఉంది:అమితాబ్ బచ్చన్

Jul 20 2014 4:48 PM | Updated on Sep 2 2017 10:36 AM

ఆనందంగా ఉంది:అమితాబ్ బచ్చన్

ఆనందంగా ఉంది:అమితాబ్ బచ్చన్

పోలియో నిర్మూలనలో తాను భాగమైనందుకు ఆనందంగా ఉందని బిగ్ బి అమితాబ్ బచ్చన్ తెలిపారు.

ముంబై: పోలియో నిర్మూలనలో తాను ఒక భాగమైనందుకు ఆనందంగా ఉందని బిగ్ బి అమితాబ్ బచ్చన్ తెలిపారు. భారతదేశంలో దాదాపు పోలియోను నిలువరించినందుకు, అందులో తాను ఒక భాగస్వామినైందుకు ఆయన సంతోషంగా వ్యక్తం చేశారు. 2005వ సంవత్సరంలో యూనిసెఫ్ (ఐక్యరాజ్య సమితి బాలల నిధి)  పోలియో నిర్మూలన బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ బచ్చన్ ను నియమించింది. అప్పట్నుంచి నుంచి పోలియో నిర్మూలన కార్యక్రమానికి యూనిసెఫ్ ప్రతినిధిగా ఉన్న అమితాబ్..  ఈ బాధ్యత ఎంతో సంతృప్తినిచ్చిందన్నాడు.

 

ఈ ఎనిమిది సంవత్సరాల ప్రయాణం తనకు చాలా హాయిగా ఉందన్నాడు. భారత్ లో పోలియో నిర్మూలన కార్యక్రమం పూర్తిగా విజయవంతమైందని అమితాబ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement