ఉచితంగా కండోమ్స్‌ హోమ్‌ డెలివరీ.. | AHF launches first free condom store | Sakshi
Sakshi News home page

ఉచితంగా కండోమ్స్‌ హోమ్‌ డెలివరీ..

Apr 28 2017 7:26 PM | Updated on Sep 5 2017 9:55 AM

ఉచితంగా కండోమ్స్‌ హోమ్‌ డెలివరీ..

ఉచితంగా కండోమ్స్‌ హోమ్‌ డెలివరీ..

దేశంలోని అన్ని ముఖ్యనగరాల్లో ఉచితంగానే కండోమ్స్‌ హోమ్‌ డెలివరీ ఇస్తామని ఏహెచ్‌ఎఫ్‌ ప్రకటించింది.

అత్యవసర సమయాల్లో సైతం మెడికల్‌ షాప్స్‌లో కండోమ్‌ కొనడానికి చాలామంది సిగ్గుపడతారు.. తద్వారా జరిగే పొరపాటుకు నిండు జీవితాన్ని కోల్పోతారు! ఇకపై అలాంటి అవాంఛిత మరణాలు ఉండకూడదనే లక్ష్యంతో.. ప్రపంచంలోనే మొట్టమొదటిదిగా ఉచిత కండోమ్‌ స్టోర్‌ ఇండియాలో ప్రారంభమైంది.

ఎయిడ్స్‌ హెల్త్‌ కేర్‌ ఫౌండేషన్‌(ఏహెచ్‌ఎఫ్‌) అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన ఈ స్టోర్స్‌ ద్వారా ఉచితంగా కండొమ్స్‌ పొందొచ్చు. దేశంలోని అన్ని ముఖ్యనగరాల్లో ఉచితంగానే హోమ్‌ డెలివరీ ఇస్తామని, సంబంధిత టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయడం లేదా మెయిల్‌ చేయడం ద్వారా కావాల్సిన చోటికే కండోమ్స్‌ తెప్పించుకోవచ్చని సంస్థ ప్రతినిధులు మీడియాకు తెలియజేశారు.

రెండు దశాబ్ధాల నాన్చివేత అనంతరం ఇటీవలే హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌(నివారణ, నియంత్రణ) బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఉచిత కండోమ్‌ స్టోర్‌.. మహమ్మారి నియంత్రణకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని ఏహెచ్‌ఎఫ్‌ అభిప్రాయపడింది. దాదాపు 21 లక్షల మంది హెచ్‌ఐవీ బాధిలున్న ఇండియా.. ప్రపంచంలోనే ఎయిడ్స​ బాధిత దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉంది. కండోమ్‌ వినియోగంపై ఉన్న బిడియాల కారణంగా ఏటా కొన్ని వేల మంది భారతీయులు ఎయిడ్స​ బారినపడుతున్నారు.

జాతీయ ఎయిడ్స్‌ నిర్మూలనా కార్యక్రమం (నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ మిషన్‌) ద్వారా నగరాలు, పట్టణాల్లో ఉచితంగా కండోమ్‌ల పంపిణీ చేపట్టినప్పటికీ.. అవి నాసిరకంగా ఉండటం, అందుబాటులో లేకపోవడం తదితర కారణాల వల్ల ప్రజల్లో వాటి వినియోగం పట్ల నిర్లిప్తత ఏర్పడింది. ఈ సవాళ్లన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తాము.. నాణ్యమైన కండోమ్‌లు అందించేందుకు ఉద్యుక్తులయ్యామని, టోల్‌ ఫ్రీ నంబర్‌1800 102 8102  లేదా freecondomstoreahf@gmail.com. ద్వారా ఉచిత కండోమ్స్‌ పొందొచ్చని ఏహెచ్‌ఎఫ్‌ తెలిపింది. (గమనిక: ప్రస్తుతానికి సదరు టోల్‌ ఫ్రీ నంబర్‌ సరిగా పనిచేయడంలేదు)

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement