లీకైన ఆ ఫొటోల్లో ఉన్నది నా భర్తే: హీరోయిన్‌ | Actress Sonu Gowda private photos leaked | Sakshi
Sakshi News home page

లీకైన ఆ ఫొటోల్లో ఉన్నది నా భర్తే: హీరోయిన్‌

Sep 20 2016 8:01 PM | Updated on Sep 3 2019 8:44 PM

లీకైన ఆ ఫొటోల్లో ఉన్నది నా భర్తే: హీరోయిన్‌ - Sakshi

లీకైన ఆ ఫొటోల్లో ఉన్నది నా భర్తే: హీరోయిన్‌

తాజాగా మరో హీరోయిన్‌ సైబర్‌ దాడుల వలలో పడింది.

తాజాగా మరో హీరోయిన్‌ సైబర్‌ దాడుల వలలో పడింది. కన్నడ హీరోయిన్‌ సోనూ గౌడ (శృతి రామకృష్ణన్‌) వ్యక్తిగత ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ కావడం దుమారం రేపింది. కొన్ని న్యూస్‌ చానెళ్లు ఆ ఫొటోలను ప్రసారం చేయడం సోనూ గౌడను ఇబ్బందిపరిచింది. ఓ వ్యక్తితో ఆమె అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న మూడు ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి.

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సోను గౌడ మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆన్‌లైన్‌లో లీకైన ఫొటోల్లో ఉన్న వ్యక్తి తన భర్త  మనోజ్‌ గౌడ అని ఆమె తెలిపింది. ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో సోనుగౌడ సన్నిహితంగా మెలుగుతున్నదని, అతనితో దిగిన ప్రైవేటు ఫొటోలు లీక్‌ అయ్యాయంటూ కొన్ని చానెళ్లు విపరీత ప్రచారం చేయడం సోనుగౌడను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. దీంతో చానెళ్లు, తన ఫొటోలు లీక్‌ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

2008లో ’ఇంతి నిన్న ప్రీతియా’ అనే కన్నడ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సోనూ గౌడ కన్నడంతోపాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. ఇటీవల పెళ్లయిన తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తున్నది. ప్రస్తుతం​ ఆమె పలు కన్నడ, తమిళ చిత్రాల్లో నటిస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement