బండెనక బండి.. ఫుట్‌పాత్‌ నిండి.. | Two Wheelers Riding on Footpaths in Hyderabad | Sakshi
Sakshi News home page

బండెనక బండి.. ఫుట్‌పాత్‌ నిండి..

Jan 29 2019 9:30 AM | Updated on Jan 29 2019 10:54 AM

Two Wheelers Riding on Footpaths in Hyderabad - Sakshi

హైదరాబాద్‌  :నగరంలో ట్రాఫిక్‌జాం కష్టాలకు ఈ చిత్రాలే నిదర్శనం. బండెనక బండి.. పుట్‌ఫాత్‌పై వరుసగా నిండి.. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చేందుకు ద్విచక్రవాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. సోమవారం మూసాపేట్‌ ప్లైఓవర్‌ వద్ద  ట్రాఫిక్‌ జాం కావడంతో ద్విచక్ర వాహనదారులు పక్కనున్న ఫుట్‌పాత్‌పైకి ఎక్కి వెళ్లాలనుకున్నారు. ఇలా ఫుట్‌పాత్‌పైకి వందలాది వాహనాలు వచ్చాయి. కొద్దిదూరం వెళ్లాక రోడ్డు ఖాళీగా కనిపించడంతో కిందికి దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.– ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి


Advertisement
 
Advertisement
Advertisement