కిడ్నీ రాకెట్‌లో మరో ఇద్దరి అరెస్ట్ | The other two men arrested in the kidney rackets | Sakshi
Sakshi News home page

కిడ్నీ రాకెట్‌లో మరో ఇద్దరి అరెస్ట్

Jan 11 2016 1:14 PM | Updated on Aug 29 2018 4:18 PM

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌కు సంబంధించి మరో ఇద్దరిని నల్గొండ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌కు సంబంధించి మరో ఇద్దరిని నల్గొండ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కిడ్నీ రాకెట్‌లో 16 మంది నిందితుల్లో నలుగురిని మొన్ననే పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు ఎద్దుల మైలారం గ్రామానికి చెందిన నక్కా శివరాజ్‌గౌడ్, హైదరాబాద్ చాంద్రాయణ గుట్టకు చెందిన ముహమ్మద్ వసియుద్ధీన్‌ను నల్గొండ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement