ది బెస్ట్ సిటీ హైదరాబాద్! | Sakshi
Sakshi News home page

ది బెస్ట్ సిటీ హైదరాబాద్!

Published Sat, Nov 22 2014 1:18 AM

ది బెస్ట్ సిటీ  హైదరాబాద్! - Sakshi

‘ఇండియా టు డే’ సర్వేలో 2 అవార్డులు
 
న్యూఢిల్లీ: హైదరాబాద్ దేశంలోనే ఉత్తమ నగరంగా రెండు విభాగాల్లో అవార్డులు అందుకుంది. ‘ఇండియా టుడే’ దేశవ్యాప్తంగా 50 నగరాలను అధ్యయనం చేసి 12 కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటించింది. బెస్ట్ ఎకానమీ సిటీ, బెస్ట్ హౌజింగ్ సిటీ అనే రెండు కేటగిరీల్లో హైదరాబాద్‌కు అవార్డులు లభించాయి.  శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఒక  కార్యక్రమంలో ఈ అవార్డులను కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి తేజావత్ రామచంద్రు అందుకున్నారు. పరిశ్రమలు, మౌలిక వసతుల ఆధారంగా ఆర్థిక విభాగంలో ఒక అవార్డు, చవకగా ఇళ్లు లభించే నగరంగా ఉన్నందుకు బెస్ట్ హౌజింగ్ సిటీ అవార్డు దక్కిందని తేజావత్ రామచంద్రు తెలిపారు.
 

Advertisement
Advertisement