‘టీ-హబ్’కు నేడు శంకుస్థాపన | Sakshi
Sakshi News home page

‘టీ-హబ్’కు నేడు శంకుస్థాపన

Published Fri, Jan 23 2015 4:43 AM

Telangana Hub foundation to be held today

సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో పరిశోధనలు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘టీ-హబ్’కు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు శుక్రవారం (23న) శంకుస్థాపన చేయనున్నారు. ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి, టీ-హబ్ బోర్డు ఆఫ్ డెరైక్టర్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. ఐటీ రంగంలో స్టార్ట్ అప్‌లకు అత్యుత్తమ పరిశోధన సౌకర్యాలను కల్పించేందుకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో టీ-హబ్ ఏర్పాటు చేయబోతున్నారు. టీ-హబ్‌లో డెరైక్టర్లుగా ఉండేందుకు సెయింట్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, శ్రీకేపిట్ ఫౌండర్ శశిరెడ్డి, కేకేఆర్ ప్రిస్మాకు చెందిన గిరీశ్‌రెడ్డి, టెక్ మహీంద్ర సీఈఓ సీపీ గుర్నానీ అంగీకరించారు.
 
 టీ-హబ్ లక్ష్యాలు..
  దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ఇది. పరిశోధనలకు అనుకూల వాతావరణం కల్పించడ ం దీని ప్రధాన లక్ష్యం.  వినూత్న ఆలోచనలు ఉన్న యువతకు కంపెనీలు ఏర్పాటుచేసేలా మేనేజ్‌మెంట్ పరమైన నైపుణ్యాలు అందిస్తుంది.  ఇతర ఇంక్యుబేటర్లకు సహకారం అందిస్తుంది.  ఆలోచన స్థాయి నుంచి అవుట్‌పుట్ వరకు పరిశోధనలకు ప్రాధాన్యమిస్తుంది.  వచ్చే ఐదేళ్లలో విజయవంతమైన 1000 స్టార్ట్ అప్ కంపెనీలు ఏర్పాటు చేయడం.  25 అత్యుత్తమ ఇంక్యుబేటర్లు ఏర్పాటు.  దాదాపు 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన.  టీ-హబ్‌లో ఉండే స్టార్ట్ ఆప్స్‌కు లాంచ్ ప్యాడ్, ప్రాథమిక పరిశోధన, కంపెనీ నుంచి మార్కెటింగ్ దశల్లో సహకారం అందించడం.  ఐఎస్‌బీ, ట్రిపుల్‌ఐటీ, నల్సార్ సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకోవడం.  రెండు దశల్లో ఏర్పాటు చేసే టీ-హబ్ కోసం మొత్తంగా రూ. 235 కోట్లు వెచ్చించనున్నారు. 3.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement