కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం

Telangana Going to Greenery With Kaleshwaram Project - Sakshi

కృష్ణా, గోదావరి బోర్డు సభ్య కార్యదర్శులు

ధర్మారం: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం శివారులో నిర్మిస్తున్న ప్యాకేజీ 6 టన్నెల్‌ పనులను శుక్రవారం కృష్ణా, గోదావరి బోర్డు కార్యదర్శుల బృందం సందర్శించింది. కృష్ణాబోర్డు మెంబర్‌ కార్యదర్శి పరమేశం, గోదావరి బోర్డు మెంబర్‌ కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ చటర్జీ ఆధ్వర్యంలో ప్యాకేజీ 6 లోని సర్జిఫూల్, పంపుహౌస్, విద్యుత్‌ సబ్‌స్టేషన్, టన్నె ల్‌ నిర్మాణాలను తిలకించారు. ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకట్రాములు ఆధ్వర్యంలో ఏఈ ఉపేందర్‌ నిర్మాణ వివరాల ప్రయోజనాలు బృందం సభ్యులకు వివరించారు.  కార్యదర్శులు చటర్జీ, పరమేశంలు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ద్వా రా గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రం సస్యశ్యామలవుతుందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top