జర సూస్కోని వోటెయ్యుండ్రి మల్ల..!

Telangana Elections Special Story - Sakshi

అందరూ మంచిగున్నరా.. నేను మీ మల్లేశాన్ని. గీ రెండ్రోజులు సర్ది జేసింది గందుకే రాలేకపోయిన. గిన్ని దినాలూ మీతో ముచ్చటబెట్టుడు మంచిగుండె. సూసిండ్రా గీ ఎలచ్చన్ల ప్రచారం జరిగినన్నాల్లు ఎన్ని సెప్పిండ్రు.. ఎంతగనం తిరిగిండ్రు.. కాల్లకి సెక్రాలు కట్కొని ఊరూరు.. గల్లి గల్లీ చుట్టేసిండ్రు. కూటమోల్లని కారోల్లు.. కారోల్లని కూటమోల్లు.. గీల్లిదర్నీ గా కమలమోల్లు.. ఆల్లని ఈల్లందరూ ఎంత తిట్టుకుండ్రో మీకు జెప్పిన. నీల్లిస్తాం.. కొల్వులిస్తం.. అప్పులు మాఫీ జేస్తం.. గది జేస్తం గిది జేస్తం అని ఊదరగొట్టిండ్రు! మీరు గెలిపించండి సాలు.. సొర్గం మీ గుమ్మం కాడ దించుతం.. అని ఆశపెట్టిండ్రు.

పార్టీలు మార్చినోల్లు.. పురాన దోస్తుల్ని దుష్మల్నని మీటింగుల్ల తిట్టినోల్లు.. ఆల్లకి ఓటేస్తే మీ బతుకు బర్బాద్‌ అయినట్లే.. తెలంగాన ఎనకయినట్లే అన్నోల్లు.. ఈల్లకి ఓటేస్తే అభివృద్ధి ఖతం మీయిస్టం మల్ల అన్నోల్లు.. ఇయన్నీ ఇన్కొని యాస్టకొచ్చింది గాదె. మా కాకా అయితే.. గిదేందిర మల్లేసు గిప్పుడే గీల్లు గిట్ల కొట్లాడుతుండ్రు.. ఈల్లని దీస్కెల్లి గా కుర్సీల కూర్సోబెడ్తే ఇంకేమైన ఉందా అన్నడు. నిజమే కాకా ఏం జేస్తం మల్ల మనం కూడ జరంత జూసుకోవాలె. ఎవరు మంచిగుండ్రు.. ఎవరు మన తెలంగానకు మంచి జేస్తరు అని దిమాక్‌ పెట్టి ఆలోచించాలె. గాల్లకె ఓటెయ్యాలె.. అని చెప్పిన. గంతె గదా.  

అయినా ఎంత గత్తర జేసిండ్రు! దావత్‌ ఇస్తమని.. నాస్టా పెట్టిస్తమని.. ట్రిప్పుల్కి పంపిస్తమని. మన ఎంకటేసుల్ని అడుగుండ్రి మల్ల ఈల్ల జాత్కాలన్ని ఇప్తడు. ఇయన్ని బేకార్‌ గానీ వదిలేయుండ్రి. మీ మల్లేశాన్ని నేను జెప్తున్న.. మీరు యేసే ఓటు తెలంగానని ముందుకు దీస్కెల్లాలె. అని అనుకున్నరు. కొంచెం గడబిడ అయినమంటె సాల్‌.. ఇగ ఐదేల్లు బర్బాద్‌ అయినట్లె! ఆయన జెప్పిండు.. ఈయన జెప్పిండు.. గివన్నీ జాన్తానై! అందుకే సెబ్తున్న ఇయ్యాల మంచిగ తయారై పోలింగ్‌బూత్‌కి పోండి. మనసుకు నచ్చినోల్లకి.. మనల్ని మన తెలంగానని ముందుకు దీస్కెల్లేటోల్లకి బరాబర్‌ ఓటు వేయుండ్రి. ఏలికి సుక్క పెట్టించ్కుని నవ్వుతూ ఇంటికెల్లుండ్రి! మన ఓటు.. మన ఇజ్జత్‌.. మనం భద్రంగా కాపాడుకోవాలె.. మంచోల్లకి మంచిగా వెయాలె! వస్తా మల్ల.. గిన్నాల్లు గీ సిల్లీ మల్లేశం ముచ్చట్లు ఇన్నరు. నవ్వుకున్నరు. అరె బై గిట్లనా అనుకున్నరు! ఏదైతేనేం నాల్గు మంచి మాటలు జెప్పిన. మల్లీ ఈలున్నప్డు వస్త. అందాక బై!! – రామదుర్గం మధుసూదనరావు

మరిన్ని వార్తలు

13-12-2018
Dec 13, 2018, 10:40 IST
సాక్షి, సిటీబ్యూరో:  సిటీలో కారు జోరుమీద పరుగులు పెట్టింది. ఇక్కడ నివసిస్తున్న విభిన్న వర్గాలు ప్రజలూ కేసీఆర్‌కే జైకొట్టారు. సీమాంధ్రుల...
13-12-2018
Dec 13, 2018, 10:01 IST
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌పార్టీ ఓటమికి ఏఐసీసీని తప్పుపట్టాల్సిన పనిలేదని, ఈ ఓటమికి రాష్ట్ర నాయకత్వమే నైతిక బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ...
13-12-2018
Dec 13, 2018, 09:45 IST
సాక్షి, సిటీబ్యూరో: చంద్రబాబు ప్రచారం వల్లే హైదరాబాద్‌ మహా నగరంలో టీడీపీతోపాటు ప్రజాకూటమిలోని కాంగ్రెస్, టీజేఎస్‌లకు సైతం ప్రజలు ఓట్లేయలేదనే...
13-12-2018
Dec 13, 2018, 09:13 IST
సాక్షి,మేడ్చల్‌ జిల్లా: మేడ్చల్‌ –మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 22,25,04 ఓట్లు ఉండగా, 12,40,441 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో ప్రధాన...
13-12-2018
Dec 13, 2018, 04:29 IST
సాక్షి, అమరావతి: ‘నాకేదో గిఫ్ట్‌ ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడికైనా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు. టీడీపీ...
13-12-2018
Dec 13, 2018, 03:46 IST
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఉన్న ‘సైలెంట్‌ సపోర్ట్‌’ను విపక్షాలు సరిగ్గా గుర్తించలేకపోయాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం...
13-12-2018
Dec 13, 2018, 03:30 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లకు 2,05,80,470(73.2 %) మంది ఓటేశారు....
13-12-2018
Dec 13, 2018, 03:22 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ చవిచూడని పరిస్థితి ఈ మారు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు చవిచూశాయి....
13-12-2018
Dec 13, 2018, 03:16 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి...
13-12-2018
Dec 13, 2018, 03:11 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీకి నూతనంగా ఎన్నికైన 119 మంది శాసనసభ్యుల్లో వివిధ పార్టీలకు చెందిన 67 మందిపై సివిల్,...
13-12-2018
Dec 13, 2018, 03:07 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ఆలోచనల్లో పడింది. కొత్తగా ఏర్పాటు చేసుకున్న...
13-12-2018
Dec 13, 2018, 03:02 IST
సాక్షి, హైదరాబాద్‌: తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే లోక్‌సభ ఎన్నికలలోనూ కారు జోరు కొనసాగే అవకాశాలు...
13-12-2018
Dec 13, 2018, 02:51 IST
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు...
13-12-2018
Dec 13, 2018, 02:46 IST
అసెంబ్లీ ఎన్నికలలో తాను ఆశించిన ఫలితాలు రాలేదని కేసీఆర్‌ అన్నారు.
13-12-2018
Dec 13, 2018, 02:37 IST
సాక్షి,హైదరాబాద్‌: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సెంటిమెంట్‌ రాజకీయాల ముందు ప్రజా కూటమి నిలవలేకపోయిందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విశ్లేషించారు....
13-12-2018
Dec 13, 2018, 01:52 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఘోర పరాభవం తర్వాత ఏం చేద్దామన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలు...
13-12-2018
Dec 13, 2018, 01:24 IST
నేను సమైక్యతావాదిని. 70ఏళ్ల తెలంగాణ వెనుకబాటుతనానికి, రాజకీయ పార్టీల దుష్పరిపాలనే ప్రధానమైన కారణమని, రాష్ట్ర విభజన దీనికి సరైన పరిష్కారం...
13-12-2018
Dec 13, 2018, 00:24 IST
బలమైన, వ్యూహాత్మకంగా అడుగేసే ప్రతిపక్ష కూటమి బీజేపీని ప్రకంపింప చేస్తుందని, చివరకు ఓడించగలుగుతుందని కూడా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ...
12-12-2018
Dec 12, 2018, 19:58 IST
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారైనట్టుగా తెలుస్తోంది. బుధవారం జరిగిన సీఎల్పీ...
12-12-2018
Dec 12, 2018, 17:55 IST
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top