ఇంటికి చేరిన ‘టింగు’ | Stolen Pet Dog Find in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇంటికి చేరిన ‘టింగు’

Jul 25 2019 1:07 PM | Updated on Jul 25 2019 1:07 PM

Stolen Pet Dog Find in Hyderabad - Sakshi

టింగుతో వంశీధర్‌

కుషాయిగూడ: గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన పెంపుడు కుక్క (టింగు) ఎట్టకేలకు ఇంటికి చేరడంతో కథ సుఖాంతమయింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సైనిక్‌పురికి చెందిన వంశీధర్‌ పెంపుడు కుక్క అపహరణకు గురైన విషయం తెలిసిందే. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే బోయిన్‌పల్లిలో చెత్త కుప్పల వద్ద కనిపించిన టింగును జగదీష్, మహేశ్‌ ఇద్దరు యువకులు చేరదీసి ఇంటికి తీసుకెళ్లారు. దీనిని గుర్తించిన మరో వ్యక్తి ఈ కుక్క విషయమై దినపత్రికల్లో వార్త వచ్చినట్లు చెప్పాడు. దీంతో సదరు యువకులు నేరుగా  వంశీధర్‌ ఇంటికి వెళ్లి కుక్కను అప్పగించారు. మీడియా, పోలీసుల చొరవతోనే టింగు తిరిగి వచ్చిందని వంశీధర్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement