‘కొత్త’ సవారీ... | special thought for new year | Sakshi
Sakshi News home page

‘కొత్త’ సవారీ...

Jan 2 2016 2:20 AM | Updated on Aug 21 2018 5:52 PM

‘కొత్త’ సవారీ... - Sakshi

‘కొత్త’ సవారీ...

కొత్త సంవత్సర వేళ.. పోలీసులు భిన్నమైన, స్ఫూర్తివంతమైన నిర్ణయం తీసుకున్నారు

కొత్త సంవత్సర వేళ.. పోలీసులు భిన్నమైన, స్ఫూర్తివంతమైన నిర్ణయం తీసుకున్నారు. కాలుష్య నివారణకు, శారీరక దారుఢ్యానికి సైకిళ్ల వాడకంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు విధి నిర్వహణలో వీలును బట్టి సైకిళ్లను వాడాలని నిర్ణయించారు. ఈ మేరకు నర్సాపూర్, రామాయంపేట ఠాణాల్లో నాలుగు చొప్పున సైకిళ్లను కొన్నట్టు ఈ రెండు స్టేషన్ల సీఐలు తిరుపతిరాజు, నందీశ్వర్ తెలిపారు. శుక్రవారం వీటికి హత్నూరలోని పలుగుమీది పోచమ్మ ఆలయంలో పూజలు చేయించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు గోపినాథ్, లాలునాయక్, బాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
                                 - నర్సాపూర్
 

Advertisement
 
Advertisement
Advertisement