వండర్ బుక్ రికార్డ్స్‌లో ఎస్‌పీ బాలుకు చోటు | SP Balu creates a new Record | Sakshi
Sakshi News home page

వండర్ బుక్ రికార్డ్స్‌లో ఎస్‌పీ బాలుకు చోటు

Jun 23 2015 6:03 PM | Updated on Sep 3 2017 4:15 AM

వండర్ బుక్ రికార్డ్స్‌లో ఎస్‌పీ బాలుకు చోటు

వండర్ బుక్ రికార్డ్స్‌లో ఎస్‌పీ బాలుకు చోటు

ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రమణ్యంకు లండన్‌కు చెందిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.

హిమాయత్‌నగర్ (హైదరాబాద్) :  ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రమణ్యంకు లండన్‌కు చెందిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆ సంస్థ దక్షిణ భారత ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇన్‌చార్జి స్వర్ణశ్రీ తదితరులు మంగళవారం బాలుకు ఆయన కార్యాలయంలో రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎస్‌పీ బాలు మాట్లాడుతూ... 18 భాషల్లో 35వేల పాటలు పాడిన తనకు అనేక అవార్డులు వచ్చాయన్నారు. లండన్‌కు సంబంధించిన సంస్థ తనను గుర్తించిన విషయం మరిచిపోలేనని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement