రేవంత్‌ రెడ్డి గన్‌మెన్లు వెనక్కి.. | Revanth reddy surrendered his gunmens at Vikarabad SP office | Sakshi
Sakshi News home page

రేవంత్‌ రెడ్డి గన్‌మెన్లు వెనక్కి..

Oct 29 2017 4:52 PM | Updated on Oct 29 2017 4:52 PM

Revanth reddy surrendered his gunmens at Vikarabad SP office

సాక్షి, వికారాబాద్‌ : కొడంగల్‌ ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ గన్‌మెన్లను కూడా వెనక్కి పంపారు. కొడంగల్‌లో తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం నేరుగా వికారాబాద్‌ ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన‌.. గన్‌మెన్లను సరెండర్‌ చేశారు.

రాజీనామా ఆమోదం పొందకముందే ఆయన ఈ పనిచేయడం గమనార్హం. ఎమ్మెల్యే పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లో ఏకవాక్య రాజీనామా లేఖను రాసిన రేవంత్‌.. దానిని తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు అందజేయాలని చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే.

రేవంత్‌ వెంట సూర్యాపేట టీడీపీ చీఫ్‌! : అక్టోబర్‌ 31న ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. తెలంగాణ జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ కీలక నేతలు సైతం ఆయన వెంట పార్టీ మారనున్నట్లు తెలిసింది. సూర్యాపేట జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పటేల్‌ రమేశ్‌రెడ్డి ఆదివారం తన అనుచరులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై, రేవంత్‌తో కలిసి వెళ్లే అంశంపై చర్చలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement