వారిద్దరు మహానాడు వేదికపై ఉంటే బాగుండేది | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన పురందేశ్వరి

Published Mon, May 28 2018 9:28 AM

Purandeswari Pays Tribute to NTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నందమూరి తారక రామారావు 95వ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె, సీనియర్‌ బీజేపీ నాయకురాలు పురందేశ్వరీ, ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వర రావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ గురించి తాను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. ఆయన గురించి తెలుగు ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. దక్షిణ భారతీయులను మద్రాసీలుగా భావిస్తుంటే తెలుగు వారికి ప్రత్యేక చరిత్ర ఉందని విశ్వవ్యాప్తంగా చాటిన మహనీయులని వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో కొత్త​ ఒరవడి సృష్టిస్తూ అనేక సంస్కరణలతో పాలనను ప్రజలకు దగ్గర చేశారని పురుందేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్‌ పుట్టిన కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్‌ కృష్ణాజిల్లాగా పేరు పెట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు, మహానాడును తెలుగుదేశం ప్రభుత్వం పండుగలా జరుపుకుంటోందని, అలాగే  ఎన్టీఆర్‌ జయంతి మే 28ని తెలుగు జాతి పండుగలా జరపాలని కోరారు. ఎన్టీఆర్‌ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని హరికృష్ణ కోరడంలో తప్పులేదని అన్నారు. ఎన్టీఆర్‌ వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ మహానాడు వేదికపై ఉండుంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement