కల్తీ పాల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి | police raids on duplicate milk centre in hyderabad | Sakshi
Sakshi News home page

కల్తీ పాల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

Nov 4 2015 2:38 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ శివార్లలో కల్తీ పాలు తయారు చేస్తున్న స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసులు బుధవారం ఆకస్మిక దాడి చేశారు.

ఘట్‌కేసర్: హైదరాబాద్ శివార్లలో కల్తీ పాలు తయారు చేస్తున్న స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసులు బుధవారం ఆకస్మిక దాడి చేశారు. కల్తీ పాలు తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ఓ మిషన్‌తో పాటు 720 లీటర్ల కల్తీ పాలు, 40 కేజీల యూరియా, 18 పాల పౌడర్ డబ్బాలు, 10 ఆయిల్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement