వ్యభిచార గృహంపై పోలీసుల దాడి: పలువురి అరెస్ట్ | police attack on prostitution houses | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి: పలువురి అరెస్ట్

Jun 6 2015 9:26 PM | Updated on Aug 21 2018 5:46 PM

వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నాగోలు (హైదరాబాద్): వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్‌బీనగర్ సరస్వతీనగర్ కాలనీలో కాకినాడకు చెందిన ఓ మహిళ ఇంటిని అద్దెకు తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

 

సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్ పోలీసులు దాడి చేయగా ఓ యువతితోపాటు సరూర్‌నగర్‌కు చెందిన మహేష్, హస్తినాపురంకు చెందిన వెంకన్న పోలీసులకు చిక్కారు. వీరితో పాటు నిర్వాహకురాలిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3500, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement