పొలాల్లోకి దూసుకెళ్లిన ఆయిల్‌ట్యాంకర్ | oil tanker accident in waarangal distirict | Sakshi
Sakshi News home page

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆయిల్‌ట్యాంకర్

Oct 3 2015 11:11 AM | Updated on Apr 3 2019 7:53 PM

వేగంగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డు పక్క ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.

వరంగల్: వేగంగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డు పక్క ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా హంటర్‌రోడ్‌లో జరిగింది. శ్రీలక్ష్మి దుర్గ ట్రాన్స్‌పోర్టుకు చెందిన ఆయిల్ ట్యాంకర్ ఈ రోజు ఉదయం వరంగల్ వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. జేసీబీల సాయంతో దాన్ని రోడ్డు మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement