'పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్' | Notifications on recruitment of Traffic home guards, drivers in police department : DGP Anurag Sharma | Sakshi
Sakshi News home page

'పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్'

Aug 7 2014 10:55 AM | Updated on Sep 29 2018 5:26 PM

'పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్' - Sakshi

'పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్'

తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో అందరికి ఆదర్శంగా నిలవాలని ఆ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో అందరికి ఆదర్శంగా నిలవాలని ఆ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. అందుకోసం పోలీసు సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. గురువారం హైదరాబాద్ నగరంలో పోలీసు సిస్టమ్లో పాల్గొనే సిబ్బంది కోసం సిస్కోలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని అనురాగ్ శర్మ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పోలీసు శాఖలో 3600 మంది డ్రైవర్లు, 1500 మంది ట్రాఫిక్ హోంగార్డుల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తన బడ్జెట్లో పోలీసు శాఖకు అత్యధికంగా నిధులు కేటాయించిందని తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రం కూడా పోలీసు వ్యవస్థకు ఇంత మొత్తంలో బడ్జెట్ కేటాయించిందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఆగస్టు 15 నుంచి పోలీసు సిస్టమ్స్ ప్రారంభం కానుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లతోపాటు పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement