పోలీసుల అదుపులో మావోయిస్టు! | Maoist sympathizer under police control ! | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో మావోయిస్టు!

Sep 23 2015 10:49 AM | Updated on Oct 9 2018 2:47 PM

వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని మావోయిస్టు సానుభూతిపరుడనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని మావోయిస్టు సానుభూతిపరుడనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన సిద్ధబోయిన సంపత్ (25) గతంలో కూలీ పనులు చేసుకునేవాడు. ఆరు నెలల క్రితం లారీ క్లీనర్ పని కోసం వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ముందు తిరిగి తన గ్రామానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం పోలీసులు సంపత్‌ను మావోయిస్టు సానుభూతిపరుడనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. సంపత్‌ను కోర్టు ముందు హాజరపరచనున్నట్టు తెలిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement